Travis Head Refuses Selfie: సెల్ఫీకి నో చెప్పిన ట్రావిస్ హెడ్.. అభిమానుల ఆగ్రహం
ABN , Publish Date - Apr 08 , 2025 | 08:05 PM
అభిమానుల సెల్ఫీ అభ్యర్థనను తిరస్కరించిన ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అభిమాని సెల్ఫీ రిక్వెస్ట్‌ను ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ నిరాకరించడం నెట్టింట వివాదానికి దారి తీసింది.కొందరు ట్రావిస్‌ను తీవ్రంగా విమర్శించగా మరికొందరు అతడికి బాసటగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, సూపర్ మార్కెట్‌కు వచ్చిన ట్రావిస్ హెడ్‌ని సెల్ఫీ దిగుతామంటూ రిక్వెస్ట్ చేశారు. కానీ హెడ్ మాత్రం తిరస్కరించాడు. ఆ తరువాత అతడిని అనుసరించిన కొందరు సెల్ఫీ ఇవ్వాలని మళ్లీ కోరారు. తాము ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులమని, ఎప్పుడు టీమ్‌కు మద్దతుగా ఉంటామని, కనీసం తమకు రెన్పాన్స్ ఇవ్వొచ్చు కదా అని అన్నారు. కానీ ట్రావిస్ మాత్రం వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ ముందుకెళ్లిపోయాడు.
ఈ వీడియో నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు ట్రావిస్‌పై విమర్శలు గుప్పించారు. ఆటిట్యూడ్ ఎక్కువైందని ఘాటు విమర్శలు చేశారు. మరికొందరు మాత్రం అతడికి అండగా నిలిచారు. స్టార్ క్రీడాకారులు పబ్లిక్ ప్లేసుల్లో ఉన్నప్పుడు అభిమానులు వారి ప్రైవసీని గౌరవించాలని అన్నారు. వారు సెల్ఫీకి నో చెప్పినప్పుడు తిరిగివెళ్లిపోవాలని సూచించారు.
మరోవైపు, తాజా ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతం అవుతోంది. ఇటీవల గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమి చవి చూసింది. ఇది ఎస్‌ఆర్‌హెచ్‌కు వరుసగా నాలుగో ఓటమి. వరుస పరాజయాలపై జట్టు కోచ్ డానియ్ వెట్టోరీ స్పందించాడు. బ్యాటింగ్ పరిస్థితులను అంచనా వేసి అందుకు అనుకూలంగా తమని తాము మలుచుకోవడంలో విఫలమయ్యామని అన్నాడు.
ప్రత్యర్థి బౌలింగ్ వ్యూహాలను బట్టి అప్పటికప్పుడు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో 170 పరుగుల లక్ష్యాన్ని ఎంచుకున్నా చివరకు 20 పరుగులు తక్కువగా చేశామని, ఇది తమ విజయావకాశాలను బాగా దెబ్బతీసిందని అన్నాడు. ఈ మ్యాచ్‌లో బాగా తడబాటుకు గురై ఎస్ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 16.4 ఓవర్లలో ఛేదించి సునాయస విజయాన్ని అందుకుంది.
ఎక్స్‌లో వైరల్ అవుతున్న వీడియోను ఇక్కడ చూడొచ్చు..
ఇవి కూడా చదవండి:
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..
రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు