IPL Suspension: ముంబై తొలిపోరుకు హార్దిక్ దూరం
ABN, Publish Date - Mar 15 , 2025 | 01:35 AM
ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. ఇందుకు కారణం, అతనిపై ఓ మ్యాచ్ నిషేధం ఉండడమే.

ముంబై: ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. ఇందుకు కారణం, అతనిపై ఓ మ్యాచ్ నిషేధం ఉండడమే. ఈ నిషేధం గత సీజన్‌లోది కావడం గమనార్హం. వివరాల్లోకెళ్తే.. గతేడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు మూడుసార్లు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడింది. దీంతో నిబంధనల ప్రకారం ఆ జట్టు కెప్టెన్‌గా హార్దిక్ రూ. 30 లక్షల జరిమానా ఎదుర్కోవడంతో పాటు ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. అయితే, ఆ జట్టు దారుణ వైఫల్యంతో గ్రూప్ దశలోనే నిష్క్రమించి, ప్లేఆ్‌ఫ్సకు దూరమవడంతో పాండ్యాపై మ్యాచ్ నిషేధం సాధ్యం కాలేదు. దీంతో ఈ సీజన్‌లో ఈనెల 23న చెన్నైలో సీఎ్‌సకే జట్టుతో ముంబై ఇండియన్స్ ఆడే తమ తొలి మ్యాచ్‌కు హార్దిక్ దూరమవక తప్పని పరిస్థితి నెలకొంది. పాండ్యాపై వేటు నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు ముంబై కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Mar 15 , 2025 | 01:35 AM