ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Women's Cricket : కొత్తవాళ్లు కొట్టేశారు

ABN, Publish Date - Jan 11 , 2025 | 06:06 AM

విజయాల జోరును భారత మహిళలు కొనసాగిస్తున్నారు. ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్లతో ఘన విజయం సాధించారు.

  • మంధాన మెరుపు ఇన్నింగ్స్‌

  • భారత్‌ ఘన విజయం

  • ప్రతిక, తేజల్‌ అర్ధ సెంచరీలు

  • ఐర్లాండ్‌తో తొలి వన్డే

రాజ్‌కోట్‌: విజయాల జోరును భారత మహిళలు కొనసాగిస్తున్నారు. ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్లతో ఘన విజయం సాధించారు. మూడు మ్యాచ్‌లసిరీ‌స్‌లో 1-0 ఆధిక్యం అందుకున్నారు. అంతగా అనుభవంలేని ప్రతికా రావల్‌ (89), తేజల్‌ హసబ్నిస్‌ (53 నాటౌట్‌) అర్ధ సెంచరీలతో సత్తా చాటగా, కెప్టెన్‌ మంధాన (29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 41) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. దాంతో 239 పరుగుల లక్ష్య ఛేదనను భారత్‌ 34.3 ఓవర్లలో 241/4 స్కోరు చేసి ముగించింది. అంతకుముందు ఐర్లాండ్‌ 50 ఓవర్లలో 238/7 స్కోరు చేసింది. కెప్టెన్‌ గాబీ లూయిస్‌ (92), లీ పాల్‌ (59) హాఫ్‌ సెంచరీలు సాధించారు. ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టింది. ప్రతిక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది.

ప్రతిక, తేజ శతక భాగస్వామ్యం: మోస్తరు ఛేదనలో మంధాన, ప్రతిక దూకుడైన ఆరంభం ఇచ్చారు. ఓవర్‌కు ఏడు పరుగుల చొప్పున మొదటి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. వెస్టిండీ్‌సతో గత టీ20, వన్డే సిరీ్‌సల్లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన మంధాన అంతగా అనుభవంలేని ఐర్లాండ్‌ బౌలర్లను ఆడేసుకుంది. ముఖ్యంగా పేసర్‌ డెంప్సీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో 4,6,4తో స్మృతి కదం తొక్కింది. అయితే అర్ధ శతకానికి చేరువైన మంధానాను సార్జంట్‌ క్యాచవుట్‌ చేసింది. హర్లీన్‌ డియోల్‌ (20), జెమీమా రోడ్రిగ్స్‌ (9) త్వరగా నిష్క్రమించడంతో 46 పరుగుల తేడాతో భారత్‌ మూడు వికెట్లు చేజార్చుకుంది. కానీ..చెరో నాలుగేసి అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవమే కలిగిన ప్రతికా రావల్‌, తేజల్‌ ఎంతో పరిణతితో ఆడి భారత ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈక్రమంలో నాలుగో వికెట్‌కు 84 బంతుల్లో 116 పరుగులు జోడించి జట్టును విజయ పథాన నడిపించారు.


ఆ ఇద్దరు ఆదుకున్నారు: టాస్‌ నెగ్గి ఐర్లాండ్‌ మొదట బ్యాటింగ్‌ చేపట్టగా..భారత బౌలర్ల ధాటికి 56/4తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. కానీ లూయిస్‌, పాల్‌ ఐదో వికెట్‌కు 117 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. భారత ఫీల్డింగ్‌ చెత్తగా ఉండడం కూడా ఈ జోడీకి కలిసి వచ్చింది. మన ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేయడంతోపాటు, మిస్‌ఫీల్డింగ్‌తో పరుగులు ఇచ్చేశారు.

Updated Date - Jan 11 , 2025 | 06:06 AM