Share News

IPL 2025, LSG vs CSK: టాస్ గెలిచిన చెన్నై.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - Apr 14 , 2025 | 07:05 PM

తాజా ఐపీఎల్‌లో తొలి స్టేజ్ ముగింపు దశకు చేరుకుంటున్న దశలో చెన్నై కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో ఈ రోజు (ఏప్రిల్ 14) లఖ్‌నవూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది.

IPL 2025, LSG vs CSK: టాస్ గెలిచిన చెన్నై.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
CSK vs LSG

తాజా ఐపీఎల్‌ (IPL 2025)లో తొలి స్టేజ్ ముగింపు (ఏడు మ్యాచ్‌లు) దశకు చేరుకుంటున్న దశలో చెన్నై కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో ఈ రోజు (ఏప్రిల్ 14) లఖ్‌నవూ, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ (CSK vs LSG) జరగబోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట్లో ఓటమి పాలైన చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ధోనీ సేన గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.


టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్‌నవూ బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది. లఖ్‌నవూ జట్టుకు ఓపెనర్లు మార్‌క్రమ్, మిచెల్ మార్ష్‌తో పాటు నికోలస్ పూరన్ కొండంత అండగా నిలుస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు రాణించి భారీ స్కోరు అందిస్తున్నారు. చివర్లో డేవిడ్ మిల్లర్ చెలరేగుతున్నాడు. పంత్ ఫామ్ మాత్రమే ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.


తుది జట్లు:

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, ఆకాశ్ దీప్

చెన్నై సూపర్ కింగ్స్: రచిన్ రవీంద్ర, రషీద్, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబె, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, ఖలీల్ అహ్మద్, కాంబోజ్, నూర్ అహ్మద్, పతిరణ

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 14 , 2025 | 07:07 PM