LSG Vs MI: ఉత్కంఠ భరిత మ్యాచ్.. ముంబైపై లఖ్‌నవూ ఘన విజయం
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:34 PM
ఏకానా స్టేడియంలో జరిగిన నేటి ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై లఖ్‌నవూ సూపర్ చార్జర్స్ ఘన విజయం సాధించింది.

ఏకానా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో జయ కేతనం ఎగురవేసింది. 204 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ఎల్ఎస్‌జీ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎమ్ఐ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్ ( 43 బంతుల్లో 67 పరుగులు), నమన్ ధీర్ (24 బంతుల్లో 46 పరుగులు) కష్టం వృథాగా మిగిలిపోయింది. చివరి ఓవర్లలో లఖ్‌నవూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో పరుగులు రాబట్టలేక తడబడ్డ ముంబై చివరకు ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
ముంబై ఇండియన్స్ టాస్ గెలవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్, మార్క్రమ్ ఎల్ఎస్‌జీకి అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్ క్రమం తప్పకుండా పరుగులు రాబడుతూ రన్ రేట్ పడిపోకుండా జాగ్రత్త పడటంతో లఖ్‌నవూ మంచి లక్ష్యాన్ని ముంబై ముందుంచింది. ఎమ్ఐ బౌలర్లలో హార్ధిక్ పాండ్యా ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు.
ఛేదనలో ఆదిలోనే ఒత్తిడి గురైన ముంబై ఇండియన్స్ మ్యాచ్ మొదట్లోనే వికెట్లు కోల్పోయి చిక్కు్ల్లో పడింది. ఆ తరువాత సూర్యకుమార్ కాస్త నెమ్మదిగా ప్రారంభించినా మిడిల్ ఓవర్స్‌లో వేగం పుంజుకున్నాడు. ఈ క్రమంలో భారీ షాట్ ఆడబోయి 67 పరుగుల వద్ద అవుటయ్యాడు. తిలక్ వర్మ కూడా బౌండరీలు రాబట్టలేక తడబడ్డాడు. మ్చా్చ్ చివరి దశలో పక్కకు తప్పుకుని మిచెల్ శాంట్నర్‌కు ఛాన్స్ ఇచ్చాడు. కానీ చివరి ఓవర్లో 22 పరుగులు రాబట్టాల్సిన అవేశ్ ఖాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా ముంబై కేవలం 10 పరుగులే రాబట్టి ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి