Pat Cummins - Md Kaif: ఎస్‌ఆర్‌హెట్ వరుస ఓటములపై స్పందించిన మహ్మద్ కైఫ్.. ప్యాట్ కమిన్స్‌పై విమర్శలు
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:10 PM
ఈ ఐపీఎల్ సీజన్‌లో హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాట్ కమిన్స్ కెప్టెన్సీ వీక్‌గా ఉందని టీమిండియా మాజీ బ్యాటర్ ముహమ్మద్ కైఫ్ తాజాగా విమర్శించాడు.

ఇంటర్నెట్ డెస్క్: నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ ఘోర ఓటమితో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి మ్యాచ్‌తో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఎస్‌ఆర్‌హెచ్ ఆ తరువాత హ్యాట్రిక్ ఓటములతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మరింత తీసికట్టు ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌హెచ్ సారథి ప్యాట్ కమిన్స్‌పై మాజీ టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. కమిన్స్ కెప్టెన్సీలో పస లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జీషాన్, కమిందు స్పిన్ ద్వయాన్ని పూర్తి స్థాయిలో ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించాడు. ఈ పరిస్థితి నుంచి కోలుకోవడం కష్టమని కూడా హెచ్చరించాడు.
‘‘బ్యాటింగ్ తీసికట్టుగా ఉంది. బౌలింగ్ పరిస్థితి కూడా అదే. ఘోర ఓటములు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడటం అంత సులువైన విషయం కాదు. అటు కమిన్స్ సరిగా బౌల్ చేయట్లేదు. ఇటు షమీ కూడా వికెట్లు తీయట్లేదు. ఈ టైం వారు కచ్చితంగా ఏదైనా ప్లాన్ చేయాలని ఎవరైనా ఆశిస్తారు. వాళ్లకు స్పిన్నర్స్ కూడా సరిగా లేదు. జాంపా ఆ మ్యాచ్‌లో ఆడలేదు. జీషాన్‌కు రంగంలోకి దింపినా అతడిని పూర్తి స్థాయిలో ఆడించలేదు. మెండిస్‌కు ఒక్క ఓవర్ ఇచ్చి సరిపెట్టారు. అతడు ఒక్క వికెట్ తీసినా అదనపు ఓవర్లు మాత్రం దొరకలేదు. ఇదంతా చూస్తుంటే నాకు కమిన్స్ నాయకత్వం బలహీనంగా అనిపిస్తోంది’’ అని అన్నాడు.
గత సీజన్ పర్‌ఫార్మెన్స్ తరువాత భారీగా పెరిగిన అంచనాల ఒత్తిడికి ఎస్ఆర్‌హెచ్ తట్టుకోలేక తడబడుతుండొచ్చని కూడా కైఫ్ సందేహం వ్యక్తం చేశాడు. ‘‘200 పరుగుల టార్గెట్ అంటే పెద్దదే. అయితే, గత ఏడాది వారి పర్‌ఫార్మెన్స్ కారణంగా వారిప ఒత్తిడి పెరిగి ఉండొచ్చు. హైదరాబాద్ ఈసారి 250 లేదా 300 స్కోరు చేస్తుందని అంతా భావిస్తున్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి టైమ్‌లో పాత ఫీట్‌ను రిపీట్ చేయడం అంత సులువు కాదు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్ల అడ్డుకట్ట కోసం మిగతా టీమ్‌లు అన్నీ ప్లాన్లు సిద్ధం చేసుకున్నట్టు నాకు అనిపిస్తోంది’’ అని కైఫ్ అన్నాడు. ‘‘గత సీజన్‌లో టీమ్స్ రెడీ కాలేదు. దీంతో, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆరు ఓవర్లలోనే 100 పరుగులు కూడా చేయగలిగారు. కానీ ఈసారి ప్రత్యర్థి టీమ్స్ ప్లాన్లతో రంగంలోకి దిగారు. అభిషేక్‌కు నెమ్మదైన, షార్ట్ బాల్స్‌ను సంధిస్తున్నారు’’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. అయితే, తమ బ్యాటర్లు మళ్లీ మునుపటి దూకుడుతో ఆడతారని హైదరాబాద్ బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్‌లిన్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి