Smartphones Launching In April: గుడ్‌న్యూస్.. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ ఇవే

ABN, Publish Date - Apr 06 , 2025 | 06:38 PM

స్మార్ట్ ఫోన్లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఈ నెలలు అధ్భుత ఫీచర్స్ ఉన్న పలు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. మరి అవేంటో, వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Smartphones Launching In April: గుడ్‌న్యూస్.. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ ఇవే
Smartphones Launching In April

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ఈ నెలలో పలు స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నాయి. అందుబాటు ధరలలో, అద్భుత ఫీచర్స్‌తో కంపెనీలు వీటిని రిలీజ్ చేయనున్నాయి. మరి ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. పరిశీలకులు చెప్పేదాని ప్రకారం రియల్‌మీ నార్జో 80ఎక్స్, వీవో వీ50ఈ, ఐకూ జెడ్‌10 ఎక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లు విడుదలకు రెడీగా ఉన్నాయి (Smartphones Launching In April).

త్వరలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

Realme Narzo 80x (ఏప్రిల్ 9న రిలీజ్)

  • బ్యాటరీ: 6,000mAh (రెండు రోజుల బ్యాటరీ లైఫ్).

  • డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్.

  • ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6400.

  • ఐపీ రేటింగ్: ఐటీ69 (ధూళి, నీటి నుంచి రక్షణ)

రియల్‌మీ నార్జో 80 ప్రో (ఏప్రిల్ 9న రిలీజ్)

  • ప్రాసెసర్: డైమెన్సిటీ 7400 (4ఎన్ఎమ్ చిప్).

  • డిస్‌ప్లే: 4,500nits పీక్ బ్రైట్నెస్.

  • బ్యాటరీ: 6,000mAh, 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్.


వీవో వీ50ఈ ( రిలీజ్ డేట్ ఏప్రిల్ 10)

  • కెమెరా: సోనీ ఐఎమ్‌ఎక్స్ 882 సెన్సార్‌తో 50MP సెల్ఫీ కెమెరా.

  • డిస్‌ప్లే: క్వాడ్ కర్వ్‌డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్.

  • పలు ఏఐ ఫీచర్స్

ఐకూ జెడ్10 (ఏప్రిల్ 11)

  • బ్యాటరీ: 7,300 ఎమ్ఏహెచ్, 90 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్.

  • చిప్‌సెట్: స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3.

  • ర్యామ్, స్టోరేజ్: 12GB ర్యామ్, 256జీబీ స్టోరేజ్.

  • డిస్‌ప్లే: 5,000 నిట్స్ ఎమోఎల్‌ఈడీ స్క్రీన్.

ఐకూ జెడ్10ఎక్స్ (ఏప్రిల్ 11)

  • చిప్‌సెట్: డైమెన్సిటీ 7300 (4nm టెక్నాలజీ).

  • బ్యాటరీ: 6,500ఎమ్ఏహెచ్.

  • ర్యామ్, స్టోరేజ్: 8GB ర్యామ్, 256జీబీ స్టోరేజ్.


ఈ ఫోన్ల ధరలు రూ.20 వేల వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెజాన్ ద్వారా వినియోగదారులు వీటిని ఆర్డర్ చేయొచ్చు. ఇక ఏసర్ కూడా భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు తీసుకురాబోతుందని సమాచారం. అయితే, వీటి పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈసారి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి ముందు మరిన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

చైనా మరో అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి

రష్యా శాస్త్రవేత్తల ఘనత.. నెల రోజుల్లో అంగారకుడిని చేరేలా రాకెట్ ఇంజెన్ రూపకల్పన

చాట్‌జీపీటీ కొత్త మోడల్‌ను ఆవిష్కరించిన ఓపెన్ ఏఐ.. ఫీచర్లు ఏంటంటే

Read Latest and Technology News

Updated Date - Apr 06 , 2025 | 06:42 PM