ప్లాస్టిక్ కట్టడి ఎలా...?
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:27 PM
మంచి ర్యాల నగరంతోపాటు జిల్లాలోని లక్షెట్టిపేట, క్యాత న్‌పల్లి, మందమర్రి, చెన్నూరు, బెల్లంపల్లిమున్సి పా లిటీల్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వినియోగం జరుగుతోం ది.

-విచ్చల విడిగా కవర్లు, వస్తువులు వినియోగం
-నియంత్రించడంలో మున్సిపాలిటీల నిర్లక్ష్యం
-వ్యాపారులకు అవగాహన కల్పించే యోచన
-మారకుంటే నేరుగా చర్యలకు శ్రీకారం
-గతంలో తనిఖీ అధికారులపై దాడుల సంఘటనలు
మంచిర్యాల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల నగరంతోపాటు జిల్లాలోని లక్షెట్టిపేట, క్యాత న్‌పల్లి, మందమర్రి, చెన్నూరు, బెల్లంపల్లిమున్సి పా లిటీల్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వినియోగం జరుగుతోం ది. ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను వ్యాపారులు విచ్చ లవిడిగా విక్రయిస్తుండగా, వినియోగదారులు సైతం వాటిని విరివిగా వాడుతున్నారు. మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలో ప్రతీ రోజు చెత్త సేకరణలో స గానికంటే ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులే లభిస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకం ద్వారా అనేక ఆరోగ్యపరమైన సమ స్యలు వస్తున్నాయని ప్రజలకు తెలినప్పటికీ అనివా ర్యంగా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్‌తో తయారు చేసిన వ స్తువులను వాడుతున్నారు. తద్వారా ప్రజలు క్యాన్సర్ తో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా...
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్‌లలో పదుల సంఖ్యలో హోల్ సేల్ ప్లాస్టిక్ విక్రయషాపులు ఉన్నాయి. వాటి నిర్వా హకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 120 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను మాత్రమే విక్రయిం చాలి. కానీ కొందరు వ్యాపారులు 120 మైక్రాన్ల మం దం ఉన్నట్లు నకిలీ ముద్రను వేసి మరీ కవర్లు య థేచ్చగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మ రి కొందరు బల్దియా సిబ్బంది, రాజకీయ నేతల అండదండలతో ప్లాస్టిక్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతీ రోజు మంచిర్యాల నగరం నుంచి దాదాపు వంద టన్నుల ప్లాస్టిక్ విక్రయాలు జరుగుతున్నా... అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు విమర్శలు వస్తున్నాయి.
పట్టించుకోని అధికారులు....
మంచిర్యాల నగరంలోని మార్కెట్ రోడ్, స్టేషన్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్డులో ఉన్న హోల్‌సేల్ షా పులలో పెద్దమొత్తంలో ప్లాస్టిక్ విక్రయాలు జరుగు తున్నాయి. ఇక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలతో పా టు బార్లు, రెస్టారెంట్లు, మటన్ షాపులు, చికెన్ షాపులు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కూరగాయల విక్రయ వ్యాపారులకు, కిరాణ షాపులకు సప్లయి ఆవుతున్నా యి. అడ్డగోలుగా ప్లాస్టిక్ దందా జరుగుతున్నా ఏ అ ధికారి కన్నెత్తి చూడక పోవడంపై పలు ప్రశ్నలు త లెత్తుతున్నాయి. కొంతమంది బల్దియా సిబ్బంది ఆ యా హోల్‌సేల్ దుకాణాల్లో మామూళ్లు వసూలు చేస్తున్నారన్న అభియోగాలు సైతం ఉన్నాయి. సింగి ల్ యూజ్ బ్యాగులు వాడాలని సిబ్బంది అవగాహన కల్పించకపోవడంతో ప్లాస్టిక్ వాడకం విచ్చలవిడిగా మారింది. గతంలో జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ నిశేధం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టేవారు. దుకాణాలలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ, భారీగా ఫైన్‌లు వే యడం ద్వారా ప్లాస్టిక్ వాడకంపై ఉక్కుపాదం మో పేవారు. దీంతో అపట్లో కొంత మేరకు నియంత్రణ జరిగింది. అయితే అప్పటి అధికారులు, సిబ్బందికి బ దిలీలు కావడంతో తనిఖీలు నిలిచిపోయాయి. దీంతో పరిస్థితి ఎప్పటిలాగే తయారైంది.
సానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై వ్యాపారి దాడి..
ప్లాస్టిక్ తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఓ హోల్‌సేల్ షాపునకు వెళ్లిన మున్సిపల్ అధికారిపై 2020 డిసెంబరు 7న చోటు చేసుకుంది. స్వచ్చ సర్వే క్షన్-2021లో భాగంగా స్థానిక శ్రీనివాస టాకీస్ రోడ్డు లోగల ఓ ప్లాస్టిక్ షాపులో అప్పటి సానిటర్ ఇన్‌స్పె క్టర్ శ్యాంసుందర్, జవాను కుంటాల రాజలింగుల నే తృత్వంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు లభించడంతో కూపీ లాగిన సిబ్బంది షాపు వెనకాల ఉన్న మరో బిల్డింగులో మరింత స్టాకు ఉందని తెలుసుకున్నారు. దీంతో వారు అక్కడికి వెళ్లగాషాపు యజమాని సిబ్బందిని దుర్భాషలాడుతూ సానిటరీ ఇన్ స్పెక్టర్‌తో పాటు జవానునుపై భౌతికదాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వ్యాపారి బూతులు తిడుతూ ఇద్దరిపై మళ్లీ దాడికి య త్నించాడు. దీంతో వెను దిరిగి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దాడికి పాల్పడ్డ వ్యాపారిపై ఫిర్యాదు చేశారు. అయితే చర్యలు చేపట్టకుం డా పోలీసులపై కొందరు ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
చర్యలు తీసుకుంటాం..
బల్దియా కమిషనర్ తౌటం శివాజీ
నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ నిబంధ నలకు అనుగుణంగా ప్లాస్టిక్ వినియోగంపై చ ర్యలు చేపడతాం. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు, అనర్థాలపై ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు ముందుగా పోస్టర్లు ముద్రించి ప్రచారం నిర్వహిస్తాం. గతంలో దాడులు జరిగి నప్పటికీ నిబంధ నలకు విరుద్దంగా ప్లాస్టిక్ విక్ర యానికి పాల్పడుతున్న వ్యాపారుల తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం. అయినా విక్రయాలు ఆపకుంటే ముమ్మర తనిఖీలు నిర్వహిస్తాం. ఇందుకోసం అవసర మైతే ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేస్తాం. బల్దియా పరిధి లో ప్రభుత్వ నిబంధనలు అతిక్ర మించి ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతాం.