పుల్వామా అమరులకు కొవ్వొత్తులతో నివాళి
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:29 PM
జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు శుక్రవారం రాత్రి మాజీ సైనికులు, వీహెచ్‌పీల

జడ్చర్ల, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు శుక్రవారం రాత్రి మాజీ సైనికులు, వీహెచ్‌పీల ఆధ్వర్యంలో వేర్వేరుగా కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. పట్టణంలోని నేతాజీచౌరస్తా వద్ద కొవ్వొత్తులను వెలిగించి, మౌనం పాటించారు. మాజీ సైనికులు శంకరయ్య, జంగిలయ్య, చంద్రశేఖర్‌గౌడ్, రవిబాబు, అరవింద్‌రెడ్డి, కృష్ణయ్య, పుల్లయ్య, నారాయణరావు, హన్మంతు, భీమయ్య, వెంకట్రాములు, బాలరాజు, మోహన్, యోగానంద్, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
రాజాపూర్ : పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు శుక్రవారం మండల కేంద్రంలోని ఏబీవీపీ విద్యార్థుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో 910 ఫీట్ల్ల జాతీయ జెండాను ఊరేగిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులైన వీర సైనికులకు మౌనం పాటించి, వారి ఆత్మకు శాంతి చేకురాలని నివాళి అర్పించారు. నరేందర్, సయ్యద్ అలీ, శ్రీను, మాధవ చారి, గిరీధర్‌రెడ్డి, నరసింహ, వెంకటయ్య, బాలకృష్ణ, రామకృష్ణ, రమేష్, ఆంజనేయులు, వెంకట్, బాలరాజ్, శ్రీధర్‌రెడ్డి, ఏబీవీపీ, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కోయిలకొండ : పుల్వామా దాడిలో అసువులు బాసిన వీర జవాన్ల సేవలు మరవలేనివని శ్వేత విద్యామందిర్ కరస్పాడెంట్ నరేందర్‌జీ తెలిపారు. శుక్రవారం ప్రిన్సిపాల్ సుబేరా, విద్యార్థులతో కలిసి పుల్వామా దాడిలో వీర జవాన్లకు నివాళి అర్పించి అర్పించారు.
హన్వాడ : పూల్వామలో తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన ఆర్మీ అమరవీరులకు చిన్నదర్పల్లిలో పాఠశాల విద్యార్థులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పూల్వామా దాడిలో మృతి చెందిన జవాన్ల చెందిన వారి ఆత్మశాంతి కోసం జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు వీహెచ్‌పీ జిల్లా అఽధ్యక్ష, కార్యదర్శులు మద్ధి యాదిరెడ్డి, నలిగేశి లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని గడియారం చౌరస్తా నుంచి వన్‌టౌన్ పోలీస్టేషన్ వరకు ర్యాలీ కొనసాగింది. దివంగత ఎస్పీ పరదేశి నాయుడు విగ్రహనికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. వన్‌టౌన్ సీఐ అయ్యప్ప, వంశీ, కుమార్, ఛత్రపతి పాల్గొన్నారు.