Share News

ఏడు నెలలుగా జీతాలు అందడంలేదు

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:31 PM

జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాక్‌, ఐసీ యూలో పనిచేసే కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆసుపత్రి ముందు సిబ్బంది నిరసన వ్యక్తంచేశారు.

ఏడు నెలలుగా జీతాలు అందడంలేదు

గద్వాల క్రైం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాక్‌, ఐసీ యూలో పనిచేసే కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఏడునెలలుగా జీతాలు అందకపోవడంతో శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిబ్బంది నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూని యన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడు తూ.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే బ్ల డ్‌బ్యాంక్‌లో 13మంది, ఐసీయూలో 20మంది సిబ్బందికి ఏడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డు పడుతున్నాయన్నారు. ఈ వేతనాల విషయమై అధికారులు కూడా తమకు సంబంఽధం లేదని అంటున్నార ని, డీఎంఈ (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేష న్‌)ను మాకు సంబంధం లేదంటున్నా రని తెలి పారు. దీంతో ఈవిషయమై కలెక్టర్‌కు, జిల్లా వైద్యాధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌, పరశురాం, ఫిరోష్‌ రహిమాన్‌, నరేష్‌, మంజూరు అహ్మద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 11:31 PM