Share News

అమర జవాన్‌లకు ఘన నివాళి

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:20 PM

పుల్వామా దాడిలో అమరులైన వీరజవాన్‌ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం వీహెచ్‌పీ, భజరంగదళ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని స్వామి వివేకానంద చౌరస్తాలో అమరుల చిత్రపటా నికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.

అమర జవాన్‌లకు  ఘన నివాళి
కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తున్న వీహెచ్‌పీ, భజరంగదళ్‌ నాయకులు

మక్తల్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పుల్వామా దాడిలో అమరులైన వీరజవాన్‌ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం వీహెచ్‌పీ, భజరంగదళ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని స్వామి వివేకానంద చౌరస్తాలో అమరుల చిత్రపటా నికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరజవాన్‌ల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోరన్నారు. సరిహద్దుల్లో రక్షణగా ఉన్న జవాన్‌లకు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. కార్య క్రమంలో వీహెచ్‌పీ, భజరంగదళ్‌ నాయకులు భీంరెడ్డి, సత్యనారాయణగౌడ్‌, మల్లికార్జున్‌రావు, భీమేష్‌, రాహుల్‌, మూర్తి, రామాంజనేయులు, గోరక్ష ప్రముక్‌ అక్షయ్‌, శివ, నాగరాజు, నవీన్‌, అంజి, మహేష్‌, ఆనంద్‌, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 11:20 PM