Share News

గ్రామాభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:33 PM

గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనేదని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు.

 గ్రామాభివృద్ధే ధ్యేయం
దేపల్లిలో రహదారి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

నవాబ్‌పేట, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనేదని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నమూన పనులు, దేపల్లిలో దేపల్లి - బీమారం రహదారి పనులకు మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య, మార్కెట్‌ చైర్మన్‌ హరలింగం, మైసమ్మ ఆలయ చైర్మన్‌ జగన్మోహన్‌రెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ తులసీరాంతో శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లోని అన్ని రహదారులను సీసీలుగా మార్చేందుకు నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. దేపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. అనంతరం దేపల్లి పంచాయతీరాజ్‌, రహదారులు భవనాల శాఖ అధికారులతో కలిసి పనులపై సమీక్షించారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో జయరాములు, సింగిల్‌ విండో చైర్మన్‌ నర్సింహులు, నవాజ్‌రెడ్డి, హమీద్‌ మహేక్‌, కొల్లూర్‌ ఖాజ, రవీందర్‌ రెడ్డి, గోపాల్‌గౌడ్‌, కోట్ల రాజేష్‌, వెంకటేష్‌గౌడ్‌, శ్రీనివాసులు, నరేష్‌ పాల్గొన్నారు.

ప్రతీ తండాకు బీటీ రోడ్డు

రాజాపూర్‌ : నియోజకవర్గంలోని ప్రతీ తండాకు బీటీ రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సింగమ్మగూడ గ్రామ పంచాయతీ మైసమ్మ కుంట నుంచి కేశ్యనాయక్‌ తండా వరకు రూ.90 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నరహరి, కృష్ణయ్య, శ్రీనివాస్‌నాయక్‌, రాఘవేందర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

మిడ్జిల్‌ : మండలంలోని వేముల మాజీ సర్పంచ్‌ శంకర్‌నాయక్‌ తండ్రి హర్యానాయక్‌ గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శుక్రవారం పెద్దగుండ్లతండాకు చేరుకొని వేసి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన మద్ది లక్ష్మారెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, పరామర్శించారు.

Updated Date - Feb 14 , 2025 | 11:33 PM