రాష్ట్ర సుభిక్షం కోసం యాగాలు....
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:22 PM
రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, సుబిక్షం కోసం యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కృష్ణ పీఠాథిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. శ్రీ వైష్ణవ అయుత చండీ అతిరుద్రం 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం నిర్వహిస్తున్న సందర్బంగా శుక్రవారం నస్పూర్‌లోని యాగశాల అవరణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ
నస్పూర్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, సుబిక్షం కోసం యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కృష్ణ పీఠాథిపతి కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. శ్రీ వైష్ణవ అయుత చండీ అతిరుద్రం 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం నిర్వహిస్తున్న సందర్బంగా శుక్రవారం నస్పూర్‌లోని యాగశాల అవరణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 15వ తేది నుంచి వచ్చే నెల 2 వరకు 16 రోజుల పాటు మహాయాగ మహోత్సవం జరుగుతుందన్నారు. ఇందుకు సంబందించిన యాగశాలల నిర్మాణ పనులు పూర్తయినట్లు పెర్కొన్నారు. యాగంలో పాల్గొనే సౌలభ్యం అందరికి కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పరిపాలన అందించాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు స్వామీజీ తెలిపారు. హోమంలో కూర్చునే వారి పేర్లను ముం దస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పూజా కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఉదయం, సాయంత్రం ఆల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం ఉంటుందన్నారు. శనివారం గణపతి పూజతో యాగ కార్యక్రమాలు మొదలు అవుతాయని స్వామీజీ తెలిపారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు...
విశ్వశాంతి కోసం నిర్వహించే మహాయాగ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజు దాదాపు 10 వేల మం ది భక్తుల దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు జరిగాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆల్పాహారం, తీర్థ ప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 15వ తేదీ శనివారం గణపతి పూజతో ప్రారంభమవుతాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున జాగరణ, శివపార్వుతుల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. మహాపూర్ణాహుతి, రాధాకృష్ణ కల్యాణం, శ్రీఽరాధా గోవింద పట్టాభిషేక మహోత్సవంతో మహాయాగ పూజలు ముగుస్తాయి.