Home » 2024
భక్తుల కొంగుబంగారమైన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం శనివారం రాత్రి ఘనంగా సాగింది. మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో వెలసినస్వామి తిరునాళ్లలో భాగంగా మూడో శనివారం దేవాదయశాఖ , గ్రామస్థుల ఆద్వర్యంలో రథో త్సవం నిర్వహించారు.
ఆరోగ్యశ్రీ ఉన్నా పలు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు అక్ర మంగా డబ్బులు వసూసు చేస్తున్నా యని, వాటిపై చర్యలు తీసు కోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కిమ్స్ సవీరా ఆస్పత్రిలో ఇలా డబ్బులు డిమాండ్ చేసి, వారు ఇవ్వకపో వడంతో వైద్యం అందించకుండా పంపారంటూ బా ధితురాలితో కలిసి గురువారం స్థానిక డీఎం హెచఓ కార్యా యంవద్ద ఆందోళనకు దిగారు.
అర్బన నియోజకవర్గం పరిధిలో ఇళ్లులేని వారికి త్వరలో ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటా మని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక 39వ డివిజనలో గురువారం మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిం చారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమ బద్ధీకరణ పథకం కింద ఇంటి పట్టా మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆయన గురువారం మండలంలోని కక్కలపల్లి పరిధిలో క్రమబద్ధీకరణ పథకం-2025 కింద దర ఖాస్తు చేసుకున్న మేకల మేరి అనే మహిళ ఇంటికి వెళ్లి నేరుగా పరిశీలిం చారు.
భరతముని జ యంతిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం కమలానగర్‌లోని శ్రీనృత్య కళానిలయం ప్రాంగణంలో నిర్వహించిన నృత్యనీరాజన ప్రదర్శన వీక్షకులను ఎంతగానో అలరించింది. తొలుత భరతముని చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు.
నగర పాలక సంస్థ పరిధిలో కుక్కల నియంత్రణ పేరుతో జరిగిన అవినీతిపై చర్య లు తప్పవని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక 17వ డివిజనలో బుధవారం మీ ఇంటికి - మీ ఎమెల్యే కా ర్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి సమస్యలపై ఆరా తీశారు.
మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం నగరంలోని పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అశోక్‌నగర్‌లోని రమాసమేత సత్యనారాయణస్వామి దేవాలయం, మూడోరోడ్డు షిర్డీ సాయిబాబా ఆలయం, మల్లేశ్వరరోడ్డులోని లక్ష్మీ గణపతి మందిరాల్లో సామూహిక సత్యనారాయణ వ్రతం ఆచరించారు.
విద్యార్థులకు ఈ నెల 14న చేపట్టనున్న కంటి అద్దాలు పంపిణీ చేసే రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అధికారుల ను ఆదేశించారు. ఆయన బుధవారం స్థానిక ఆదర్శ పాఠశాలను అసిస్టెంట్ కలెక్టర్ వినూత్నతో కలసి సందర్శిం చారు.
కొండమీదరాయుడు స్వామి బ్రహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, వారి కుటుంబ సభ్యులు బండారు రవికుమార్, బండారు లీలావతి స్వామి వారికి పట్టు వసా్త్రలు సమర్పించారు. బుధవారం వేకుజామున జరిగే స్వా మి వారి కళ్యాణోత్సవం కోసం వాటిని సమర్పించారు.
జిల్లా సర్వజన ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై అసిస్టెంట్ కలెక్టర్ బొలి ్లనేని వినూత్న దృష్టి సారించారు. ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి క మిటీ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. వాటిని పరిష్క రించే బాధ్యతను అసిస్టెంట్ కలెక్టర్‌కు కలెక్టర్ వినోద్‌కుమార్ అప్పగిం చారు.