Share News

World Cup Final 2023: భారత్ ప్రపంచ కప్ ఓటమితో.. ఉరేసుకుని బెంగాల్ యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-11-20T17:36:20+05:30 IST

ప్రపంచ కప్ ఫైనల్(World Cup 2023) లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పశ్చిమ బెంగాల్(West Bengal) లో ఓ యువకుడు భారత్ ఓటమి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు.

World Cup Final 2023: భారత్ ప్రపంచ కప్ ఓటమితో.. ఉరేసుకుని బెంగాల్ యువకుడి ఆత్మహత్య

కోల్‌కతా: ప్రపంచ కప్ ఫైనల్(World Cup 2023) లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేక పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పశ్చిమ బెంగాల్(West Bengal) లో ఓ యువకుడు భారత్ ఓటమి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంకురా జిల్లాకు చెందిన 23 ఏళ్ల రాహుల్ బట్టల దుకాణంలో పని చేసేవాడు.

అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. పనిలో ఉన్నా కానీ.. ఏ మ్యాచ్ వదలకుండా చూసేవాడు. ఆదివారం ఆస్ట్రేలియా(Australia), భారత్ కి మధ్య క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ ఉండటంతో సెలవు తీసుకున్నాడు. అనూహ్య పరిస్థితిల్లో భారత జట్టు అంతగా పర్ఫార్మెన్స్ చూపించకపోవడం.. చివరికి ఆస్ట్రేలియా గెలవడంతో యువకుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.


రాత్రి సైతం సరిగ్గా నిద్ర పోలేదు. ఓటమి బాధ జీర్ణించుకోలేక.. ఇవాళ ఉదయం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని బావమరిది ఉత్తమ్ సూర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడికి వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యలూ లేవని.. భారత్ ఓడిపోవడంతోనే ఇలా చేశాడని ఉత్తమ్ పోలీసులకు తెలిపారు.

ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌కు పంపించామని, అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ టైటిల్ పోరులో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-11-20T17:36:21+05:30 IST

News Hub