Home » Palnadu
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు (AP Elections).. ఎన్నికల తర్వాత జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. దాడులు జరిగిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 144 సెక్షన్ పెట్టడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి..
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.
ఏపీలో ఇటివల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు(Palnadu) జిల్లాకు కొత్త కలెక్టర్గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ జిల్లాకు కొత్త కలెక్టర్ వచ్చారు. ఈ నేపథ్యంలో లత్కర్ శ్రీకేశ్ బాలాజీని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో ఐదేళ్లలో వైసీపీ (YSRCP) నేతలు పెట్రేగిపోయారు. వారు సృష్టించిన అరాచకం, దాడులు అన్ని ఇన్ని కావు. సామాన్యులపై దాడులు చేస్తూ ఈ ఐదేళ్లలో ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురిచేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలో పలు ఘర్షణలు, అల్లర్లు నెలకొన్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) చర్యలు చేపట్టింది. ఈ మేరకు పల్నాడు కలెక్టర్, పలు జిల్లాల ఎస్పీలపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల రణరంగం అంతా ఇంతా కాదు. టీడీపీ నేతలపై దాడులు, నిర్బంధం ఇలా అనేక రకాలుగా దుశ్చర్యలకు పాల్పడ్డారు వైసీపీ నేతలు. అధికారపార్టీ విధ్వంసంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ వైసీపీ నేతలను పోలీసుల అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: పల్నాడు హింసపై నిజాల్ని సమాధి చేసే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నిజనిర్దారణ కమిటీని మాచర్ల ఎందుకు వెళ్లనివ్వలేదని ప్రశ్నించారు. పల్నాడు హింసకు కారణాల్లో పోలీసుల తీరుపైనే ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. డీజీపీ, ఎస్పీలు మారినా కిందిస్థాయి ఖాకీల్లో వైసీపీ వీరవిధేయులు ఉన్నారన్నారు.
Andhrapradesh: ఏపీలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడు అల్లర్లకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో ఆరుగురిని సభ్యులుగా చేర్చుతూ.. వారంతో అల్లర్లు జరిగే ప్రాంతానికి వెళ్లి టీడీపీ శ్రేణులకు అండగా ఉండాలని అధినేత ఆదేశించారు.
Andhrapradesh: పల్నాడులో జరుగుతున్న దాడులపై గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. దాడులను నియంత్రించటంలో ఎన్నికల సంఘం, డీజీపీ, చీఫ్ సెక్రటరీ పూర్తిగా విఫలమయ్యారన్నారు.
రెండు గంటల ముందు వరకూ అమ్మమ్మ, తాతయ్యకు కబుర్లు చెబుతూ ఆడుకుంది ఆ పాప..! ఆ బుజ్జిబుజ్జి మాటలకు మురిసిపోతూ మెల్లిగా మనవరాలితో కలిసి నిద్రలోకి జారుకున్నారు ఆ పెద్దవాళ్లు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం