నేతలు ముఖం చాటేస్తున్నారు

ABN , First Publish Date - 2020-11-09T08:20:05+05:30 IST

అమరావతిని మరింత అభివృద్ధి చేస్తామని నమ్మబలికి ఓట్లు దండుకున్న నేతలు అధికారంలోకి రాగానే ముఖం చాటేశారంటూ

నేతలు ముఖం చాటేస్తున్నారు

అన్ని రకాలుగా మోసం చేశారు: అమరావతి రైతుల ఆవేదన


గుంటూరు, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): అమరావతిని మరింత అభివృద్ధి చేస్తామని నమ్మబలికి ఓట్లు దండుకున్న నేతలు అధికారంలోకి రాగానే ముఖం చాటేశారంటూ రాజధానిలోని అబ్బరాజుపాలెం గ్రామ రైతులు, మహిళలు ముఖానికి ప్లకార్డులు అడ్డుపెట్టుకొని ఆదివారం నిరసన తెలిపారు. ‘ఒకే రాష్ట్రం-ఒకటే రాజధాని’ నినాదంతో రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు ఆదివారానికి 327వ రోజుకు చేరాయి. రాత్రి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. 

Updated Date - 2020-11-09T08:20:05+05:30 IST