కరోనా: భారత ఆర్మీ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2020-04-21T01:50:34+05:30 IST
కరోనా కలకలం నేపథ్యంలో భారత్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: కరోనా కలకలం నేపథ్యంలో భారత్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర విధుల్లో ఉండి లేదా సెలవులు పూర్తి చేసుకుని తిరిగి విధుల్లో చేరాలనుకుంటున్న వారిని వివిధ కేటగిరీలుగా వర్గీకరించింది. విధుల్లో చేరబోయే యూనిట్లకు కేవలం 500 కీమీల దూరంలో ఉన్నవారిని అత్యధిక ప్రాధాన్య వర్గంగా గుర్తించింది. వీరు వ్యక్తిగత వాహానాల ద్వారా తమ యూనిట్లకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. వ్యుహాత్యవ ప్రధాన్యం కలిగిని నార్తన్ కమాండ్‌కు చెందిన సిబ్బందిని కూడా ఇదే కేటగిరీలోకి చేర్చింది. అంతే కాకుండా..ఆర్మీ మెడికల్ కార్ప్స్, డెంటల్ కార్ప్స్, మిలిటరీ నర్సింగ్ సర్వీస్ సిబ్బంది కూడా ఈ వర్గీకరణలోకే రానున్నారు. ఇక తమ సొంత యూనిట్లకు 500 కీమీల కంటే ఎక్కువ దూరంలో ఉన్నవారిని రెండో ప్రధాన్యతా వర్గంగా గుర్తించింది. తూర్పు కమాండ్ సిబ్బంది కూడా ఇదే కేటగిరీలోకి వస్తారు. ఆ కేటగిరీల ఆధారంగా సెలవుల్లో ఉన్న సిబ్బందిని ఆర్మీ తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. ఇక క్వారంటైన్ అవసరమైన వారికి ఎల్లో క్యాటగిరీగా, క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిని గ్రీన్ వర్గంగా, రోగలక్షణాలున్న సిబ్బందిని రెడ్ వర్గంగా గుర్తించింది.