మహంకాళి అమ్మవారి సేవలో జస్టిస్ విజయలక్ష్మి
ABN , First Publish Date - 2021-06-14T08:50:56+05:30 IST
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మి కుటుంబ సమేతంగా

నరసరావుపేట రూరల్, జూన్ 13: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు న్యాయమూర్తికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొటప్పకొండలో త్రికోటేశ్వరస్వామిని కూడా జస్టిస్ విజయలక్ష్మి దర్శించుకున్నారు.