అధికారుల అత్యుత్సాహం
ABN , First Publish Date - 2021-01-03T05:45:38+05:30 IST
అధికారుల అత్యుత్సాహం

ఫ టీడీపీ బ్యానర్లు తొలగించిన కార్పొరేషన్ సిబ్బంది
ఫ అడ్డుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు
ఫ పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వైనం
విద్యాధరపురం, జనవరి 2 : భవానీపురంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పర్యటన ఉందంటూ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లను నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగించి అత్యుత్సాహం ప్రదర్శించారు. విషయం తెలుసుకున్న స్థానిక డివిజన్‌ల నాయకులు, కార్యకర్తలు సిబ్బందిని అడ్డుకున్నారు. పోలీ సుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. స్థానిక 40వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పివి. చినసుబ్బయ్య, డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి వెలగలేటి భార్గవ్ (రాయుడు) ఆధ్వర్యంలో భవానీపురం ఎమ్మార్వో కార్యాలయం నుంచి స్వాతి సెంటర్ వరకు జాతీయ రహదారి డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాలకు, స్వాతి సెంటర్‌నుంచి శివాలయం సెంటర్ వరకు డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాలకు నూతన సంవత్సరం శుభాకాం క్షలు చెబుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. శనివారం మంత్రి ఈ రోడ్డు మార్గంలో వస్తారని తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు టౌన్ ప్లానింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి టీడీపీ బ్యానర్లను తొలగించాలని ఆదేశించారు. దీంతో స్థానిక టౌన్‌ప్లానింగ్ ఇన్‌స్పెక్టర్ బేగ్ ఆదేశాల మేరకు టౌన్‌ప్లానింగ్ ఆక్రమణ నిర్మాణాల దళం సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రత్యేక వాహనంలో వెళ్లి టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించి రోడ్డుపై పార వేశారు. విషయం తెలుసుకున్న చినసుబ్బయ్య, మాజీ కార్పొరేటర్ వై. రామయ్య, వెలగ లేటి భార్గవ్ పలువురు కార్యకర్తలు వెళ్లి సిబ్బందిని అడ్డుకు న్నారు. వైసీపీ బ్యానర్లు కూడా తొలగించాలని వారు పట్టుబట్టారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం జరిగింది. నైటు గస్తీలో ఉన్న భవానీ పురం పోలీసులు వారివద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుని సీఐకు సమాచారం తెలిపారు. సీఐ ఆదేశాల మేరకు సిబ్బంది వైసీపీ బ్యాన ర్లు కూడా తొలగించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
టీడీపీ నాయకులపై కేసు
భవానీపురం స్వాతిరోడ్డులో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ సిబ్బం దిని అడ్డుకున్న టీడీపీ నాయకులపై శనివారం రాత్రి భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీడీపీ నాయకులు వై. రామయ్య, చిన్న సుబ్బయ్య, వర్మ, కప్పగంతు శివ, బాజీ బ్యానర్లు తొలగిస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిని అడ్డుకున్నారు. అధికారుల ఆదేశాల మేరకు విధులను అడ్డుకున్న టీడీపీ నాయకులపై సత్యనారాయణ పోలీసు లకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.