కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2021-06-30T04:58:24+05:30 IST

మండలంలోని మల్కపేట గ్రామంలో గురువారం మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.

కేటీఆర్‌ పర్యటన  ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

కోనరావుపేట, జూన్‌ 29 : మండలంలోని మల్కపేట గ్రామంలో గురువారం మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ను ప్రారంభించనున్నారు.  కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌తోపాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, మంత్రి   దయాకర్‌రావు, చల్మెడ ఆస్పత్రి చైర్మన్‌ లక్ష్మీనర్సింహరావు, మాజీ మంత్రి ఆనందరావు, కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు హాజరుకానున్నారు.  ఏర్పాట్లను పరిశీలించినవారిలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సర్పంచ్‌ ఆరె లత, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, డీపీవో రవీందర్‌, తహసీల్దార్‌ నరేందర్‌, ఎంపీడీవో రామకృష్ణ,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-06-30T04:58:24+05:30 IST