వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో టీడీపీ జెండా ఎగరాలి
ABN , First Publish Date - 2022-11-06T00:20:44+05:30 IST
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం ని యోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని ఆ నియోజకవర్గం టీడీపీ ఇనచార్జి పరి టాల శ్రీరామ్ పేర్కొన్నారు. శనివారం అ నంతపురంలోని తన స్వగృహంలో ధర్మ వరం రూరల్ టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇనచార్జిలు, వివిధ విభాగాల నాయ కులతో ఆయన సమావేశమయ్యారు.

టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్
అనంతపురం అర్బన, నవంబరు 5: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం ని యోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని ఆ నియోజకవర్గం టీడీపీ ఇనచార్జి పరి టాల శ్రీరామ్ పేర్కొన్నారు. శనివారం అ నంతపురంలోని తన స్వగృహంలో ధర్మ వరం రూరల్ టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇనచార్జిలు, వివిధ విభాగాల నాయ కులతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు అండగా మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర చేసిన తరహాలో ధర్మవరం పరిధిలో కూడా పాదయాత్ర చేయాలా లేదా వరుస ఆందోళన కార్యక్రమా లు చేపట్టాలా అన్న విషయంపై నాయకులతో చర్చించారు. భారీ వర్షాలతో పాటు పడాల్సిన సమ యంలో వర్షం పడకపోవడంతో దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ధైర్యం చెబుతూ, వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి పాదయాత్ర చేయాలన్న ఆయన అభిప్రాయంతో నాయకులు ఏకీ భవించారు. ధర్మవరంలో ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ పేరుతో జనం మధ్య హడావుడి చేయడం తప్పా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడం లేదన్నారు. కనీసం బాధిత రైతులను పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. కెమెరాల ముందు షో చేస్తూ తన అనుచరుల ద్వారా భూ దందాలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. గతంలో కొందరి మూలంగా పార్టీకి దూరమైన నాయకులు, కార్యకర్తలు అం దరినీ కలుపుకొని సమన్వయంతో ముం దుకు వెళ్లాలని సూచించారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.