అందుకే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: bopparaju venkateswarlu

ABN , First Publish Date - 2022-10-29T16:32:56+05:30 IST

భూముల రీసర్వేకు ప్రభుత్వం కొంత సమయం ఇవ్వాలని APJAC చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) అన్నారు. పని ఒత్తిడికిలోనై గ్రామ ,వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: bopparaju venkateswarlu

ఏలూరు: భూముల రీసర్వేకు ప్రభుత్వం కొంత సమయం ఇవ్వాలని APJAC చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) అన్నారు. పని ఒత్తిడికిలోనై గ్రామ ,వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని రీసర్వే త్వరగా చేయమని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. గ్రామాల్లో రీసర్వే కు వెళుతున్న ఉద్యోగులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో సాహసోపేతంగా చేపట్టిన రీసర్వే రాబోయే తరాలకు సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఉద్యోగులు గ్రామస్థాయిలో ఎన్ని ఎకరాలు చేయగలరో, ఉన్నతాధికారులు ఒక అంచనాకు వచ్చి ఆ ప్రకారం ఉద్యోగుల చేత పనిచేయించుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవరు ఆత్మహత్యకు పాల్పడవద్దని ఆయన సూచించారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రీసర్వేకు ఎటువంటి బడ్జెట్ కేటాయించకుండా ఉద్యోగులను ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్రించారు. ఒక్కో తహసిల్దారు కార్యాలయానికి నిర్వహణ నిమిత్తం నెలకు కేవలం 250 రూపాయలను కేటాయిస్తున్నారని తెలిపారు.

Updated Date - 2022-10-29T16:32:58+05:30 IST