వరసిద్ధుడి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2022-12-12T23:55:47+05:30 IST
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి సోమవారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు.

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 12: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి సోమవారం కాణిపాక వరసిద్ధుడిని దర్శించుకున్నారు. వారిని ఈవో వెంకటేశు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనానంతరం వారిని వేదాశీర్వాద మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.