ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tulsi Reddy: జగన్.. రాయలసీమ ద్రోహి

ABN, First Publish Date - 2022-11-29T13:09:19+05:30

ముఖ్యమంత్రి జగన్(Cm jagan) సీమ వాసిగా ఉంటూ రాయలసీమకు పదే పదే మోసం చేయడం శోచనీయమని ఏపీ పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి(Tulsi Reddy) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.

రాయలసీమ ద్రోహి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి జగన్(Cm jagan) సీమ వాసిగా ఉంటూ రాయలసీమకు పదే పదే మోసం చేయడం శోచనీయమని ఏపీ పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి(Tulsi Reddy) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని జగన్, ఆయన పార్టీ వారు పదే పదే చెబుతారు కానీ హైకోర్టు మాత్రం అమరావతిలోనే ఉంటుంది. న్యాయమూర్తులకు, సిబ్బందికి ప్రభుత్వం నివాస వసతి కల్పించింది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకి తరలించే అంశం ముగిసిన అధ్యాయమని నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదించిన సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ సుప్రీం కోర్టులో చెప్పారు. ఎందుకు ఈ ద్వంద్వ నీతి? ఎందుకు ఈ మోసం? జగన్ పాలనలో సీమకు నవ మోసాలు, నవ ద్రోహాలు జరిగాయి. రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీ నిధులు తెప్పించలేదు. సెయిల్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తే ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ ప్రజలే. రాష్ట్ర ప్రభుత్వం మాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా కడప - రాయచోటి - మదనపల్లి - బెంగళూరు రైల్వే బ్రాడ్ గేజ్ పనులు నిలిచి పోయాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో కాకుండా విశాఖలో పెట్టమని జగన్ ప్రభుత్వం లేఖ వ్రాయడం శోచనీయం. నిధుల కొరతో రాయలసీమ సాగనీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండి పోయాయి. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోని కారణంగా రాబోవు రోజుల్లో సీమ సాగునీటి ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తే ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ రైతులే. రాయలసీమలోనే వ్యవసాయ పంపు సెట్లు ఎక్కువ. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన శ్రీకాళహస్తి వద్ద ఉన్న మన్నవరం ప్రాజెక్టును మోడీ ప్రభుత్వం మూసివేస్తూ ఉంటే జగన్ ప్రభుత్వం అడ్డుకోలేదు. రాయలసీమకు ద్రోహం చేస్తున్న వైసీపీ పార్టీకి రాబోవు ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి.’’ అని తులసిరెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-11-29T13:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising