రాయచోటి పట్టణాన్ని బాగు చేయండి

ABN , First Publish Date - 2022-12-16T23:03:05+05:30 IST

జిల్లా కేంద్రాన్ని బాగు చేయా లని, జనసేన పార్టీ అన్నమ య్య జిల్లా నాయకుడు రామ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

రాయచోటి పట్టణాన్ని బాగు చేయండి
మీడియాతో మాట్లాడుతున్న జనసేన పార్టీ నాయకులు

రాయచోటిటౌన్‌, డిసెంబరు 16: జిల్లా కేంద్రాన్ని బాగు చేయా లని, జనసేన పార్టీ అన్నమ య్య జిల్లా నాయకుడు రామ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శు క్రవారం ఆయన జనసేన పార్టీ రాయచోటి నియోజకవర్గ ఇన్‌ చార్జి హసన్‌బాషా, పార్టీ జిల్లా కార్యక్రమాల సభ్యుడు రియాజ్‌లతో కలిసి రాయచోటి మున్సిపాలిటీలోని పలు వార్డులలో అధ్వానంగా ఉన్న సిమెంటు రోడ్లు, కంపు కొడుతున్న డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయచోటి పట్టణం అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా మిగిలిపోయిందన్నారు. ప్రస్తుత రాస్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్లుగా చిన్నపనాటి అభివృద్ధి పనులు చేపట్టిన పాపాన పోలేదన్నారు. శాసన సభ్యుడు తన రాజకీయ లబ్ది, సొంత వర్గీయుల అభివృద్ధి విషయంలో చూపుతున్నంత శ్రద్ధ నియోజకవర్గ పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాతాల అభివృద్ధిపై లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:07:20+05:30 IST