ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Botsa: విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2022-11-24T12:08:22+05:30

విద్యార్థులు ఆనందంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విద్యార్థులు ఆనందంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. గురువారం ఏపీ పోలీ టెక్ ఫెస్ట్‌ను బొత్స (AP Minister) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విద్య, వైద్యం, వ్యవసాయానికి వైసీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. చదువుకున్న విద్యార్థులు రాష్ట్రానికే కాదు దేశానికి ఆస్తి అవుతారని సీఎం భావిస్తారని తెలిపారు. విద్యార్థులలోని సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇవ్వడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. జ్యోతి ప్రజ్వలన కూడా ఇక్కడ టెక్నాలజీనీ ఉపయోగించారన్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫెస్ట్‌లు చాలా బాగా జరిగాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో లక్ష 70 వేల మంది పోలిటెక్నిక్‌లో చదువుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు విద్యదీవెన మొక్కుబడిగా ఇచ్చారని విమర్శించారు. 14 సంవత్సరాలు మంత్రిగా చేశానని... అయితే విద్యపై ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమే అని తెలిపారు. మారుతున్న విధానాలకు అనుగుణంగా విద్య వ్యవస్థలో మార్పులు చేస్తున్నామన్నారు. ఈ దశలో ఒక లక్ష్యం ప్రతి ఒక్కరిలో ఉండాలని... దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని విద్యార్థులకు మంత్రి బొత్స సత్యనారాయణ (YCP) సూచించారు.

Updated Date - 2022-11-24T12:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising