AP News: సీనియర్ జర్నలిస్టు అంకబాబును అదుపులోకి తీసుకున్న సీఐడీ
ABN , First Publish Date - 2022-09-23T17:43:45+05:30 IST
సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును గత రాత్రి ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడ (Vijayawada): సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు (Ankababu)ను గత రాత్రి ఏపీ సీఐడీ పోలీసులు (CID Police) విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ (Whatsapp)లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్ పెట్టారని అంకబాబుపై అభియోగం... ఇటీవల ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత అంశంలో.. పోస్టింగ్ ఫార్వార్డ్ చేయడం వల్ల అంకబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అంకబాబుపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని సీఐడీ పోలీసులు అభియోగం మోపుతూ ఐపీసీ 153(A), 505(2), రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శుక్రవారం అంకబాబును కోర్టులో హాజరుపర్చనున్నారు.