ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollu Ravindra: వైసీపీకి సరైన పేరే దొరకలేదా? బీసీలంతా బోరుమంటున్నారు

ABN, First Publish Date - 2022-12-02T14:54:29+05:30

బీసీల కోసం పెట్టే సభకు కూడా సరైన పేరే దొరకలేదా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర (Kollu Ravindra) నిలదీశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జయహో బీసీ నినాదం

బీసీలంతా బోరుమంటున్నారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బీసీల కోసం పెట్టే సభకు కూడా సరైన పేరే దొరకలేదా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర (Kollu Ravindra) నిలదీశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జయహో బీసీ నినాదం తెలుగు దేశం పార్టీ సొంతం అని చెప్పారు. రాష్ట్ర బీసీ నేతలంతా జగన్ పాలనలో ఇదేం ఖార్మరా బోబోయ్ అంటూ బోరుమంటున్నారని చెప్పుకొచ్చారు. బీసీ మంత్రులు పదవుల కోసం బీసీల భవిష్యత్‌ను జగన్(Cm jagan) కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో అమలైన బీసీ పథకాలు నిలిపేసినా జగన్‌రెడ్డిని నిలదీయని అసమర్థలుగా మంత్రులు మిగిలిపోయారని మండిపడ్డారు. మూడున్నరేళ్లలో బీసీలకు ఏం చేశారో చెప్పే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని అడిగారు. 8 వేల ఎకరాల బీసీ అసైన్డ్ ల్యాండ్స్‌ను లాక్కున్నందుకు బీసీ సభలు పెడుతున్నారా? లేదంటే రూ.34 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించినందుకా? 650 మందిపై అక్రమ కేసులు పెట్టి.. 2 వేల మందిపై దాడులు చేసినందుకు బీసీ సభ పెడుతున్నారా? అంటూ కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

‘‘బీసీల శవాలపై వైఎస్. కుటుంబం ఎదిగింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక 26 మంది బీసీలను అతికిరాతకంగా చంపించారు. విశ్వవిద్యాలయ కులపతులు, ఉపకులపతులు పోస్టుల్లో రెడ్లకు తప్ప బీసీలకు స్థానం లేదు. టీటీడీ ఛైర్మన్, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్, ఏపీఐఐసీ ఛైర్మన్ లాంటి పోస్టులకు కూడా బీసీలు పనికిరారా? జగన్ రెడ్డి ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లతో ఒక్క బీసీకి పైసా లబ్ధి కలగలేదు. తెలుగుదేశం పార్టీ బీసీ నేతలపై జగన్ రెడ్డికి చెప్పలేనంత కక్ష, ఈర్ష్యాద్వేషం ఉంది. నాతో సహా అచ్చెన్నాయుడు, యనమల, అయ్యన్నపాత్రుడిపై లెక్కకు మిక్కిలి తప్పుడు కేసులు పెట్టించి దారుణంగా హింసించారు. రాష్ట్ర బీసీలంతా జగన్ పాలనలో ఇదేం ఖర్మరా అంటూ బోరుమంటున్నారు.’’ అని కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-12-02T14:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising