ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda uma: వంశీ ఫిర్యాదు చేసినా వెంట్రుక కూడా పీకలేరు

ABN, First Publish Date - 2022-12-02T12:55:53+05:30

వంశీ.. డీజీపీకి ఫిర్యాదు చేసినా నా వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అలాగే విజయవాడలో సెక్స్ స్కామ్ కూడా జరిగిందని

వెంట్రుక కూడా పీకలేరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సంకల్ప సిద్ధి స్కామ్ ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వ్యవహారంపై డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ(Bonda Umamaheswara Rao) స్పందిస్తూ.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంకల్ప సిద్ధి వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని(Kodali Nani), వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) హస్తం ఉందని ఆరోపించారు. వంశీ, ఆయన అనుచరుడి పాత్ర బయట పెట్టాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలో బయటపడ్డ ఈ స్కామ్ చాలా పెద్ద కుంభకోణం అని వివరించారు. సీజ్ చేసిన సెల్‌ఫోన్ కాల్ లిస్ట్, డేటాను బయట పెట్టాలని కోరారు. వంశీ.. డీజీపీకి ఫిర్యాదు చేసినా నా వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అలాగే విజయవాడలో సెక్స్ స్కామ్ కూడా జరిగిందని తెలిపారు. కాలేజీ విద్యార్థినుల వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సెక్స్ స్కామ్ వెనుక కూడా వైసీపీ నేతల హస్తం ఉందని చెప్పుకొచ్చారు.

అలాగైతే అసెంబ్లీ రద్దు చేయొచ్చు కదా?

175కి 175 అసెంబ్లీ సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి జగన్(Cm jagan).. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. అబద్ధపు వాగ్దానాలతో జగన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. బీసీ, దళిత ప్రజలను నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. నవరత్నాలు పేరుతో నవ బొక్కలు పెట్టారని వ్యాఖ్యానించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంతో 2 కోట్ల మంది ప్రజలను కలుస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల కుటుంబాలను కలిసి సమస్యలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత చార్జ్‌షీట్ వేస్తామని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పోలీసులకు ఆదేశాలు రావడంతోనే చంద్రబాబును పోలవరం వెళ్లకుండా ఆపేశారని విమర్శించారు. పోలవరంలో వాస్తవాలు బయటకు వస్తాయనే చంద్రబాబును వెళ్లనివ్వలేదని బోండా ఉమ ఆరోపించారు.

నిన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. డీజీపీని కలిసి సంకల్ప సిద్ధి వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో తన అనుచరుల ప్రమేయం లేదని.. ప్రతిపక్ష నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

Updated Date - 2022-12-02T13:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising