మోసపూరిత పాలకులను సాగనంపుదాం
ABN , First Publish Date - 2022-08-17T06:15:14+05:30 IST
మోసపూరిత హామీలో అధికారంలోకి వచ్చి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి అప్పుల పాలు చేసిన అసమర్ధపాలకులను సాగనంపుదామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు.
టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కోటేశ్వరరావు
పెద్దదోర్నాల, ఆగస్టు 16: మోసపూరిత హామీలో అధికారంలోకి వచ్చి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి అప్పుల పాలు చేసిన అసమర్ధపాలకులను సాగనంపుదామని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని బలిజపల్లెలో టీడీపీ క్లస్టర్, యూనిట్, గ్రామ పార్టీ బూత్ కన్వీనర్లకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఒక్కచాన్స్ అంటూ అధికారలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నారు. రాష్ట్రం ఏ ఒక్కవర్గం వారు కూడా సంతోషంగా లేరన్నారు. సంక్షేమం అంటూ అవినీతి పాలన చేస్తూ రూ.7లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపాడన్నారు. ఐదేండ్ల పాలన కోసం పాతికేళ్లకు సరిపడా అప్పు లు చేసి రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్టాడన్నారు. ఉద్యోగులు, కార్మికులు, వృద్ధులు, వికలాంగులను కూడా మోసగించాడన్నారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు ఏమయ్యా యని ప్రశ్నించారు. రోడ్లలో గంప మట్టి పోయలేదన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు అందరూ ఇబ్బందులు పడుతున్నారని తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ ప్రాంతం మంత్రి ఒరగబెట్టిందేమీ లేదని ప్రజలకు అర్దమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీయేనని ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా ఎరిక్షన్‌బాబు గెలుస్తారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధికి తోడ్పాటునందిస్తారని, కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడుఏర్వ మల్లికార్జునరెడ్డి, సీనియర్ నాయకులు షేక్ మాబు, దొడ్డా శేషాద్రి, బట్టు సుధాకర్ రెడ్డి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, సమ్మద్ భాష, రావిక్రింది సుబ్బరత్నం, టీ చెన్నారెడ్డి, జీ వెంగళరెడ్డి, లక్ష్మయ్య, వై.చెంచయ్య, ఏసులు, కర్రావుల రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.