ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Jagan: ‘బాయ్ బాయ్ బాబు’.. అని చెప్పాల్సిన సమయం వచ్చింది

ABN, First Publish Date - 2022-11-23T13:06:37+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan reddy) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ... భార్యతో సంసారం చేసే వారిని శ్రీరాముడు అంటామని.. పరాయి మహిళను ఎత్తుకెళ్లే వాడిని రావణుడు అంటామని.. మరి సొంత మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన వారిని ఏమంటారని వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. సొంత మామను, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు ‘‘బాయ్ బాయ్ బాబు.... మీ సేవలు మాకొద్దు’’.. అని చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాజకీయాలు చెడిపోయాయని తెలిపారు. తాను దుష్ట చతుష్టయంను నమ్మకోలేదని... దేవుడి దయ, ప్రజలను నమ్ముకున్నానని ముఖ్యమంత్రి(AP CM) స్పష్టం చేశారు.

ఐదేళ్లు జనసేన అధినేత పవన్ (Pawan Kalyan), చంద్రబాబు (TDP Chief) సంసారం చేశారన్నారు. ఉద్దానంలో దత్త పుత్రులు పర్యటనలు చేశారని తెలిపారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వంలో ఏం చేశారని ప్రశ్నించారు. ఉద్దానంకు మంచి నీరు అందించే చర్యలు చేపట్టామని అన్నారు. కిడ్నీ రోగులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంపై ఒడిస్సా సీఎంతో మాట్లాడినట్లు తెలిపారు. వంశధార ప్రాజెక్టు అడ్డంకులు అధిగమిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-23T13:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising