వైసీపీ ఎమ్మెల్సీ ఫంక్షన్లో టెక్కలి ఎస్ఐ రికార్డింగ్ డ్యాన్స్.. అర్ధనగ్నంగా ఉన్న యువతితో..
ABN , First Publish Date - 2022-11-05T18:49:37+05:30 IST
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) పుట్టినరోజు వేడుకల్లో ఓ ఎస్‌ఐ చిందులేశారు. ఐటమ్‌సాంగ్‌కు యువతితో కలిసి డ్యాన్స్ చేశారు.

శ్రీకాకుళం: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) పుట్టినరోజు వేడుకల్లో ఓ ఎస్‌ఐ చిందులేశారు. ఐటమ్‌సాంగ్‌కు యువతితో కలిసి డ్యాన్స్ చేశారు. అదుపుతప్పిన ఆయన ప్రభుభక్తితో అధికారపార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. ఎస్‌ఐ చిందులు వేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి టెక్కలిలోని వెంకటేశ్వరకాలనీ ఆయన ఇంటి ఆవరణలో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. కొంతమంది యువతులను ఇందుకోసం రప్పించారు. యువతులు పొట్టిగౌనుతో డాన్స్ చేస్తుండగా టెక్కలి ఎస్‌ఐ చౌదరి హరికృష్ణ కూడా వారితో కలిసి చిందులేశారు. అర్ధనగ్న నృత్యాలు ఆపాల్సిన ఎస్‌ఐ.. వారితో కలిసి డ్యాన్స్ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హరికృష్ణ డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసుశాఖలో కలకలం రేపింది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.