Satyakumar: వైసీపీ సర్కార్ ముందస్తుకు వెళ్లే ఛాన్స్!
ABN, First Publish Date - 2022-12-29T15:50:02+05:30
వైసీపీ ప్రభుత్వం (Ycp Government) ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉంది అని, కేంద్రానికి మాత్రం ఆ అవసరం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (BJP National Secretary Sathya Kumar) అభిప్రాయపడ్డారు
విశాఖ: వైసీపీ ప్రభుత్వం (Ycp Government) ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉంది అని, కేంద్రానికి మాత్రం ఆ అవసరం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (BJP National Secretary Sathya Kumar) అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే పరిస్థితి ఉంది. పరిపాలన రాజధాని పేరుతో జగన్ (Cm jagan) కొండలను పిండి చేస్తున్నారు. అప్పులు విషయంలో తప్పులు చెబుతున్నారు. 9 లక్షల కోట్ల అప్పులు ఈ రాష్ట్రం చేసింది.. కానీ మూడు లక్షల కోట్లే అని చెబుతున్నారు. పైగా అప్పులు కోసం మాట్లాడితే చెప్పుతో కొట్టమని సిగ్గులేకుండా మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలవరంపై గతంలో చేసిన ఆరోపణలు ఏమైయ్యాయి? పోలవరం ప్రాజెక్టు (Polavaram project)ను గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏటీఎం(ATM)లా వాడుకున్నాయి. మోదీ (pm modi) దగ్గర జగన్ అన్ని అబద్ధాలే చెప్పారు. మెట్రో రైలు(Metro train) విషయంలో జగన్ అబద్ధాలు ఆడుతున్నారు.. డీపీఆర్‌లు కేంద్రానికి పంపలేదు. కడప స్టీల్ ప్లాంట్(Kadapa Steel Plant) ఏర్పాటుపై జగన్‌ను ప్రజలు తప్పుబడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం మాట్లాడటం దివాళా కోరుతనం బయట పడింది. వైసీపీతో బీజేపీకి మ్యాచ్ ఫిక్సింగ్ లేదు.. జనసేన (Janasena)తోనే పొత్తు ఉంది. జీవీఎల్‌పై మంత్రి గుడివాడ (AP Minister Gudivada Amarnath) చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. జగన్, విజయమ్మకి విశాఖలో అన్ని ప్రాంతాలు తెలుసా? మంత్రి గుడివాడకి సందులు, గొందులు మీద ఉన్న అవగాహన.. ఆయన శాఖలపై లేదు. రాష్ట్రంలో పరిశ్రమలను తరిమేసి కొత్త పరిశ్రమలు వస్తున్నాయని కబుర్లు చెబుతున్నారు. మంత్రులు తిట్లు తిట్టమని శిక్షణ ఇస్తున్నారు. ఏపీలో పాలకుల చేతివాటం.. విద్యుత్ స్మార్ట్ మీటర్లపై కూడా చూపుతున్నారు. ఇప్పుడు కదా ఈ రాష్ట్రంలో అసలు ఆట మొదలు పెట్టాం.’’ అని సత్యకుమార్ చెప్పుకొచ్చారు.
Updated Date - 2022-12-29T16:15:10+05:30 IST