పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-11-23T00:20:59+05:30 IST
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు.

యూటీఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయుల ధర్నా
సిరిపురం, నవంబరు 22: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్.నాగమణి మాట్లాడుతూ పెండింగ్ ఆర్థిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 30న విజయవాడలో రాష్ట్రస్థాయి లో ధర్నా నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి నాగేశ్వరరావు, తాడాన అప్పారావు, అనకాపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.శ్రీలక్ష్మి, చిన్నబ్బాయి, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు విల్సన్‌బాబు, మహేష్, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.