చిట్టవరంలో హైడ్రామా

ABN , First Publish Date - 2022-08-24T06:09:37+05:30 IST

నరసాపురం మండలం చిట్టవరంలో మంగళవారం ఐదు గంటలపాటు హైడ్రామా చోటు చేసుకుంది. నరసాపురం రూరల్‌ ఎస్‌ఐ ప్రియకుమార్‌ తీరును నిరసిస్తూ వైసీపీ నాయకుడు కాకిలేటి ఆనంద్‌కుమార్‌ సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశారు.

చిట్టవరంలో హైడ్రామా
టవర్‌ ఎక్కిన వైౖసీపీ నాయకుడు ఆనంద్‌

ఎస్‌ఐ తీరుతో సెల్‌ టవర్‌ ఎక్కిన వైసీపీ నాయకుడు 

సీఐ హామీతో ఐదు గంటల ఉత్కంఠకు తెర 

నరసాపురం రూరల్‌, ఆగస్టు 23 : నరసాపురం మండలం చిట్టవరంలో మంగళవారం ఐదు గంటలపాటు హైడ్రామా చోటు చేసుకుంది. నరసాపురం రూరల్‌ ఎస్‌ఐ ప్రియకుమార్‌ తీరును నిరసిస్తూ వైసీపీ నాయకుడు కాకిలేటి ఆనంద్‌కుమార్‌ సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశారు. ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలని, తనపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయకపోతే ఆత్యహత్య చేసుకుంటానంటూ భీష్మించాడు. చివరికి సీఐ శ్రీనివాసయాదవ్‌ హామీతో టవర్‌ దిగి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఆ వర్గానికి చెందిన కొందరు తనపై దాడి చేశారని, వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదని తెలుసుకున్న ఆనంద్‌ స్టేషన్‌కు వెళ్లి అడిగాడు. అయితే ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.. మనస్థాపానికి గురై ఉదయం గ్రామంలోని టవర్‌ ఎక్కి కూర్చొన్నాడు. స్థానికులు, పోలీసులు ఎంత నచ్చ చెప్పినప్పటికీ దిగిరాకపోవడంతో సీఐ వచ్చి దాడికి పాల్పడిన వారిపై విచారించి, కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆనంద్‌ కిందకు దిగి వచ్చాడు. 

Updated Date - 2022-08-24T06:09:37+05:30 IST