ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Money: డబ్బు విషయంలో ఈ 5 తప్పులు మీరూ చేస్తున్నారా?

ABN, First Publish Date - 2022-11-05T20:03:10+05:30

ఒక వ్యక్తి ఎంత డబ్బు పొదుపు (Money saving) చేయగలుగుతాడనేది అతడి అలవాట్లు, పద్ధతులను బట్టి ఒక అంచనా వేయవచ్చు. ఆర్థిక నిర్వహణలో (Financial management) క్రమశిక్షణ, సరైన అవగాహన చాలా చాలా ముఖ్యం. ఈ రెండింటినీ పాటించకుండా ఆర్థిక పరిపుష్టిని సాధించాలనుకోవడం ఒకింత సంక్లిష్టమనే చెప్పాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క వ్యక్తి ఎంత డబ్బు పొదుపు (Money saving) చేయగలుగుతాడనేది అతడి అలవాట్లు, పద్ధతులను బట్టి ఒక అంచనా వేయవచ్చు. ఆర్థిక నిర్వహణలో (Financial management) క్రమశిక్షణ, సరైన అవగాహన చాలా చాలా ముఖ్యం. ఈ రెండింటినీ పాటించకుండా ఆర్థిక పరిపుష్టిని సాధించాలనుకోవడం ఒకింత సంక్లిష్టమనే చెప్పాలి. కొందరు వ్యక్తుల తాము ఆర్థికంగా ఏం సాధించాలో ముందే నిర్ణయించుకుని.. ఆ దిశగా పయనిస్తుంటారు. కానీ కొందరు వ్యక్తులకు మాత్రం ఆర్థిక లక్ష్యాలు, ప్రణాళికలు ఏమీ ఉండవు. ‘ఏదైతే అదైందిలే’ అని భావిస్తూ గుడ్డిగా ముందుకెళ్తుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తుల సంఖ్య భారతీయ సమాజంలో పెద్దగానే ఉంటుంది. భారతీయులు డబ్బు విషయంలో అనుసరించే 5 అతిపెద్ద తప్పిదాలు ఉన్నాయి. ఏ వ్యక్తైనా ఈ పొరపాట్లను నియంత్రించుకోగలిగితే సంపదను పెంపొందించుకోవడంతోపాటు జీవన ప్రమాణాలను తేలిగ్గా మెరుగుపరచుకోవచ్చు. మరి చేయకూడని, ఖచ్చితంగా మానేయాల్సిన ఆ 5 అలవాట్లు ఏవో మీరూ ఓ లుక్కేయండి.

1. కొందరు వ్యక్తుల వద్ద డబ్బు బాగానే ఉంటుంది. బాగానే మిగుల్చుకోగలుతారు. కానీ ఆ డబ్బుని ఇంట్లోనే దాచిపెడుతుంటారు. బీరువాలోనో లేదా పరుపు కిందనో భద్రంగా ఉంచుతారు. బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్సియల్ సంస్థల్లో డిపాజిట్ పేరు చెబితే వణికిపోతుంటారు. ఇలా చేయడం వల్ల సంబంధిత వ్యక్తులకు ఓనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. సంపద వృద్ధికి ఆస్కారమే ఉండదు. ఏ బ్యాంకులోనో ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed deposit) చేస్తే కనీస వడ్డీయైనా లభిస్తుంది.

2. భారతీయుల్లో అత్యధికులకు ఆర్థిక ప్రణాళికలు, లక్ష్యాలపై సరైన అవగాహన ఉండదనే అభిప్రాయాలున్నాయి. ఏదైతే అదవుతుందిలే అని బతికేస్తున్నవారు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తుంటారు. ఇలాంటివారు ఆర్థిక పరిపుష్టిని సాధించలేరు. మెరుగైన జీవితాన్ని అసలే గడపలేరు. కాబట్టి సరైన ఆర్థిక అవగాహనతో ప్రణాళికాబద్ధం ముందుకెళ్లడం ఎంతో ముఖ్యం.

3. ఏ వ్యక్తైయినా ఎంత చిన్న వయసులో పెట్టుబడి మొదలుపెడితే అంత మంచిది. చాలా మంది ఈ విషయంలో వెనుకబడి ఉంటారు. ఆలస్యం అమృతం విషం అన్న చాందన.. వయసు దాటిన తర్వాత పెట్టుబడులతో ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయని గ్రహిస్తే మేలు. చిన్నవయసులోనే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే చక్కటి ప్రతిఫలాలు అందుకోవచ్చు. ఆర్థిక పరిపుష్టిని సాధించవచ్చు.

4. చాలా మంది ఇన్సూరెన్స్‌ను అంత సీరియస్‌గా పట్టించుకోరు. కానీ ఆర్థిక ప్రణాళికల్లో ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైనదని ఆర్థిక నిపుణులు పదేపదే చెబుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించి ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలాలు అందుకోవచ్చు.

5. డబ్బు మొత్తం ఒకేచోట పెట్టుబడి పెట్టడం.. ఆర్థిక అవగాహనలేనివారిలో ప్రముఖంగా కనిపించే లక్షణం. ఒకేచోట పెట్టుబడి పెట్టడం అంత ఉత్తమం కాదు. పెట్టుబడి కోసం చక్కటి వనరులను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. తగిన నిష్పత్తిలో పెట్టుబడి కేటాయింపులు చేస్తే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. లేదంటే చేదు అనుభవాలే మిగిలేందుకు ఆస్కారం లేకపోలేదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-11-05T20:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising