ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Surrogacy అంటే ఏమిటి? గ్రూప్‌-1 మెయిన్స్‌ కోసం..

ABN, First Publish Date - 2022-12-21T16:12:25+05:30

భారతదేశం(India)లో చౌక ధరల్లో సరోగేట్‌ల లభ్యత ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాణిజ్యపరమైన సరోగసి(Surrogacy) మాత్రం 2002 నుంచి భారతదేశంలో

Surrogacy అంటే ఏమిటి?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రూప్‌-1 మెయిన్స్‌ - జనరల్‌ ఎస్సే

భారతదేశం(India)లో చౌక ధరల్లో సరోగేట్‌ల లభ్యత ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాణిజ్యపరమైన సరోగసి(Surrogacy) మాత్రం 2002 నుంచి భారతదేశంలో చట్టబద్ధమెంది. 2004లో గుజరాత్‌లోని ఆనంద్‌ అనే ప్రాంతం సరోగసికి కేంద్రంగా దేశవ్యాప్త గుర్తింపు పొంది అప్పట్లో చర్చల్లో నిలిచింది.

ఈ మధ్యకాలంలో ‘సరోగసి’ అనే పదం ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ‘సరోగసి’నే తెలుగులో అద్దె గర్భం అంటున్నారు. సాంకేతికత పెరుగుతున్న ఈరోజుల్లో సరోగసి అనేది జీవశాస్త్రంలో ఉద్భవించిన ఒక గొప్ప వరంగా భావించవచ్చు. సరోగసి అనేది కొన్ని జంటలకు బిడ్డను కలిగి ఉండటానికి ఏకైక అవకాశంగా కూడా మారుతోంది. పెళ్లయిన జంటల్లో పది నుంచి పదిహేను శాతం మంది వివిధ కారణాల వల్ల సంతానాన్ని కనలేకపోతున్నారు. సాంకేతికంగా, సరోగసిని సహాయక పునరుత్పత్తి పద్ధతిగా పేర్కొనవచ్చు. సర్రోగేట్‌ అనే పదం లాటిన్‌ పదం ‘‘సర్రోగటస్‌’’ (ప్రత్యామ్నాయం) నుంచి ఉద్భవించింది. ఒక స్ర్తీ గర్భం దాల్చని పరిస్థితిలో మరొక స్ర్తీ బిడ్డను మోసి, జన్మనిచ్చి సంతానలేమితో బాధపడే స్ర్తీకి మాతృత్వాన్ని అందించే ప్రక్రియగా చెప్పవచ్చు. సాధారణంగా సరోగసి పద్ధతి రెండు రకాలుగా ఉంటుంది. అవి.. కృత్రిమ(గెస్టేషనల్‌) పద్ధతిలో జరిపే సరోగసి, సంప్రదాయ/సహజసిద్ధ సరోగసి. గెస్టేషనల్‌ సరోగసిలో.. దంపతుల నుంచి స్ర్తీ అండం, పురుషుడి శుక్రకణంతో IVF/ICSI విధానం ద్వారా ప్రత్యేక పరిస్థితిలో (ఇన్‌ విట్రో) ఫలదీకరణం చెందిన పిండాన్ని మరొక స్ర్తీ గర్భంలో మోస్తుంది. ఆమెను సరోగేట్‌ తల్లిగా పేర్కొంటారు. ఇలా ఈ స్ర్తీ తొమ్మిది నెలలు ఆ బిడ్డని మోసి, జన్మనిచ్చి దంపతులకు ఇస్తుంది. ఈ పద్ధతిలో సరోగేట్‌ తల్లికి, తనకి పుట్టిన బిడ్డకి జన్యుపరంగా ఎలాంటి సంబంధం ఉండదు. సంప్రదాయ/సహజమైన సరోగసిలో, సంతాన లేమితో సమస్యను ఎదుర్కొంటున్న దంపతుల్లో భర్త నుంచి సేకరించిన శుక్ర కణాలను IVF/I-CSI ప్రక్రియ ద్వారా సరోగేట్‌ తల్లిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలా ఫలదీకరణం జరిగిన తరవాత సరోగేట్‌ తల్లి గర్భధారణ చేస్తుంది. అలా ఏర్పడిన పిండాన్ని నవ మాసాలు మోసిన తరవాత బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డను దంపతులకు ఇస్తుంది. ఫలితంగా వచ్చే బిడ్డ జన్యుపరంగా సర్రోగేట్‌, మగ భాగస్వామికి సంబంధించినది కానీ స్ర్తీ భాగస్వామికి కాదు. ఇటీవల సెలబ్రిటీలు ఎక్కువగా అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కంటున్నారు. తొమ్మిది నెలలు బిడ్డను మోయడం, గర్భం ధరించడం వల్ల శరీరాకృతి దెబ్బతినడం, ప్రసవం ద్వారా పొట్టపై వచ్చే మార్పుల కారణాల వల్ల చాలా మంది సెలబ్రిటీలు సరోగసి పద్థతినే ఎంచుకుంటున్నారు. జన్యు పరంగా చూస్తే సరోగసి పద్ధతిలో బిడ్డను పొందిన దంపతులు ఆ బిడ్డతో పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ సంబంధాన్ని కలిగి ఉంటారు. సాధారణంగా దత్తత తీసుకుని ప్రేమను పంచడంతో పోలిస్తే తమకే పుట్టారు అనే భావన ఈ సరోగసి వల్ల ఉంటుందని దంపతులు భావిస్తున్నారు.

సరోగసి అనేది వంధ్యత్వం, సంతాన లేమి సమస్యతో ఇబ్బంది పడే జంటలకు ఒక పరిష్కారంగా ఉన్నందున ప్రపంచానికి భారతదేశం ఒక గమ్యస్థానంగా కూడా మారుతోంది. భారతదేశంలో చౌక ధరల్లో సరోగేట్‌ల లభ్యత ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాణిజ్యపరమైన సరోగసి మాత్రం 2002 నుంచి భారతదేశంలో చట్టబద్ధమెంది. 2004లో గుజరాత్‌లోని ఆనంద్‌ అనే ప్రాంతం సరోగసికి కేంద్రంగా దేశవ్యాప్త గుర్తింపు పొంది అప్పట్లో చర్చల్లో నిలిచింది. ఆ తరవాత ఈ అద్దె గర్భం ఒక వ్యాపారంలా చాప కింద నీరులా విస్తరించింది.

సరోగసి నిబంధనలు ఏంటి?

  • సరోగసి - 2021 చట్టం ప్రకారం బిడ్డ కావాలనుకునే జంటకు కచ్చితంగా వివాహం అయి ఉండాలి. మహిళ వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. అలాగే పురుషుని వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

  • సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కావాలనుకునే వారికి పిల్లలు ఉండకూడదు. దత్తత తీసుకున్న పిల్లలూ ఉండకూడదు. అలాగే గతంలో సరోగసి పద్ధతి ద్వారా కలిగిన పిల్లలూ ఉండకూడదు.

  • పిల్లలు ఉండి వారు మానసికమైన, శారీరకమైన దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నా.. ప్రాణాంతక వ్యాధులు ఉన్నా.. సరోగసి ద్వారా పిల్లలను కనవచ్చు.

  • అలాగే సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కావాలనుకునే వారికి ఆ అవసరం ఉందో లేదో వైద్య అధికారులు ముందుగా ధ్రువీకరించాలి. అప్పుడే సరోగసికి చట్టం అనుమతి ఇస్తుంది.

  • పెళ్లి కాకుండా కలిసి ఉండే వారి గురించి చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదు.

  • ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, ఎల్జీబిటీ కమ్యూనిటీకి చెందిన వారు సరోగసి ద్వారా బిడ్డను కనే అనుమతి ఉండదు.

  • అమ్మకం, వ్యభిచారం, ఇతర చెడు మార్గాల్లో సరోగసిని ఉపయోగించకుండా తాజా చట్టం నిషేధించింది. బిడ్డ జన్మించిన తరవాత అన్ని హక్కులు సంబంధిత జంటకే ఉంటాయని స్పష్టం చేసింది. ఒకవేళ అబార్షన్‌ చేయించాలంటే అద్దె తల్లి, అధికారుల అనుమతి తీసుకోవాలి. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.పది లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

  • ఈ వ్యవస్థను సమర్ధించే వారు, విమర్శించేవారు ఎవరి వాదన వారివే. సరోగసిని మానవ గౌరవానికి విరుద్ధంగా చెప్పవచ్చు. ఒకవైపు, పిల్లలు లేని దంపతులకు సరోగసి అనేది పిల్లలను ఎలాగైనా కనొచ్చు అనే ఆశను రేకెత్తిస్తుంది. మరోవైపు, కొంత మందికి 9 నెలల గర్భ భారం అనే ఒక భావనను, పేద మహిళకు ఇది కుటుంబ ఆర్థిక సమస్యలను తీర్చే ఒక బ్లాంక్‌ చెక్‌ లాగా ఉంది. కానీ ఒక స్ర్తీ ఆర్థిక ప్రయోజనం కోసం మరొక స్ర్తీ సంతాన ప్రయోజనం కోసం తన గర్భాశయాన్ని ఇంక్యుబేటర్‌గా ఉపయోగించడం. ఇలా... అద్దెగా తన గర్భాన్ని పంచుతూపోతూ ఉంటే ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలతో కొందరు మహిళలు సంతానాన్ని పొందలేక దుఃఖిస్తుంటే డబ్బున్న కొందరు సెలెబ్రిటీలు అద్దె గర్భం ద్వారా సంతానాన్ని కనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆరోగ్యంగా ఉండి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రతి మహిళా అమ్మతనాన్ని ఆస్వాదించాలి గానీ ఇలా డబ్బుతో ఆ కమ్మదనానికి దూరం కాకూడదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

-ఎం. బాలలత

సివిల్స్‌ మెంటార్‌

Updated Date - 2022-12-21T16:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising