ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Byjusకు భారీ షాక్‌! అక్రమాలపై NCPCR సీరియస్

ABN, First Publish Date - 2022-12-22T11:02:29+05:30

రాష్ట్ర పాలకులకు ఎంతో ముద్దొచ్చే బైజూ‌స్‌(Byjus)కు భారీ షాక్‌ తగిలింది. ఆ సంస్థ ఇచ్చే కంటెంట్‌ ఆధారంగా

భారీ షాక్‌!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్రమాలపై జాతీయ బాలల కమిషన్‌ ఆగ్రహం

రాష్ట్రంలో మాత్రం బైజూస్‌పై అనుగ్రహం..

ట్యాబ్‌ల పంపిణీ రోజునే భారీ షాక్‌

బైజూస్‌ సీఈవోకు కమిషన్‌ సమన్లు

రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశం

విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తోంది

తమ పాఠాలు వినకుంటే భవిష్యత్తు ఉండదని భయపెడుతోంది

తప్పుడు మార్గాల్లో సమాచారం సేకరణ

ఈ అక్రమాలు మా దృష్టికి వచ్చాయి: కమిషన్‌

బైజూస్‌... తల్లిదండ్రులను ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌(Black mail Byjus) చేస్తోంది. ‘మా పాఠాలు వినకుంటే మీ పిల్లల భవిష్యత్తు నాశనమే’ అన్నట్లుగా బెదిరిస్తోంది! డేటా చౌర్యానికి పాల్పడుతోంది!

...ఇది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) తేల్చి చెప్పిన మాట!

బైజూస్‌... చాలా గొప్ప సంస్థ! ఇది మన పిల్లలకు ఉచితంగా కంటెంట్‌ అందిస్తోంది. దీనివల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. అందుకే బైజూ్‌సతో ఒప్పందం కుదుర్చుకున్నాం!

...ఇది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పదేపదే చెబుతున్న మాట!

(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పాలకులకు ఎంతో ముద్దొచ్చే బైజూ‌స్‌(Byjus)కు భారీ షాక్‌ తగిలింది. ఆ సంస్థ ఇచ్చే కంటెంట్‌ ఆధారంగా 500 కోట్ల విలువైన ట్యాబ్‌లను కొనుగోలు చేసి పంపిణీ ప్రారంభించినరోజే అనూహ్య పరిణామం ఎదురైంది. బాలల హక్కులు, డేటా ప్రైవసీ (సమాచార గోప్యత)ని ఉల్లంఘిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై బైజూ‌స్‌కు సమన్లు జారీ చేసినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (National Commission for Protection of Child Rights) తెలిపింది. బుధవారం తన 50వ జన్మదినం సందర్భంగా బాపట్లలో 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల(tabs)ను సీఎం జగన్‌(Cm jagan) అందించారు. అదే సమయంలో ఢిల్లీలోని ఎన్‌సీపీసీఆర్‌ చైర్‌పర్సన్‌ ప్రియాంక్‌ కనుంగో మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించే ఎడ్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’ అక్రమాల పుట్టగా మారిందని, చిన్నారులను, తల్లిదండ్రులను బెదిరిస్తోందని తెలిపారు. బైజూస్‌ చేతిలో మోసపోయామంటూ.. వేల మంది తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారని పేర్కొన్నారు. ‘‘విద్యార్థులు(students), వారి తల్లిదండ్రుల(parents) ఫోన్‌ నంబర్లను కొనుగోలు బైజూస్‌ కొనుగోలు చేస్తోంది. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే. తమ కోర్సులు కొనుగోలు చేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని బెదిరిస్తోంది’’ అని తెలిపారు. ఇలాంటి అక్రమాలను చూస్తూ మౌనంగా కూర్చోలేమని కమిషన్‌ వ్యాఖ్యానించారు. ‘‘విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లను బైజూస్‌ ఎలా కొనుగోలు చేస్తోందో మా దృష్టికి వచ్చింది. తొలి తరం విద్యార్థులను బైజూస్‌ లక్ష్యంగా చేసుకుంది. దీనిపై మేం మౌనంగా ఉండం. కఠిన చర్యలు తీసుకుంటాం. నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తాం’’ అని ప్రియాంక్‌ అన్నారు. దీనికి సంబంధించి గత శుక్రవారమే బైజూస్‌ సీఈవో బిజు రవీంద్రన్‌కు సమన్లు పంపించినట్టు తెలిపారు. శుక్రవారం తమ ముందు హాజరై సంజాయిషీ ఇవ్వాలని కోరినట్టు చెప్పారు.

బైజూస్‌ నియమించిన సేల్స్‌ బృందాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేలా కోర్సుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న విషయంపై వార్తా కథనాలు వచ్చాయని, వాటి ఆధారంగానే తాము విచారణ చేపట్టామని ప్రియాంక్‌ పేర్కొన్నారు. బైజూస్‌ కోర్సులు కొనుగోలు చేసిన వారు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారని, తాము మోసపోయామని, దోపిడీకి గురయ్యామని మీడియాకు వివరించిన విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. ‘‘తల్లిదండ్రులను ఆకర్షించేందుకు బైజూస్‌ మరో అక్రమమార్గం కూడా ఎంచుకుంది. కోర్సులు కొనుగోలు చేసేందుకు రుణ ఒప్పందాలు చేసుకుంటోంది. అనేక మంది వినియోగదారులు చేసిన ఫిర్యాదులపై బైజూస్‌ స్పందించి చర్యలు తీసుకోలేదు’’ అని ప్రియాంక్‌ తెలిపారు. సీపీసీఆర్‌ చట్టం-2005లోని సెక్షన్‌ 14 ప్రకారం సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు కమిషన్‌కు ఉన్నాయని, దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. సీఈవో రవీంద్రన్‌ శుక్రవారం తమ ముందు హాజరు కాకుండా తప్పించుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని కమిషన్‌ హెచ్చరించింది.

విచారణ దీనిపైనే...

బైజూస్‌ సంస్థ ఐటీ చట్టంలోని డేటా ప్రైవసీని ఉల్లంఘిస్తోందని కమిషన్‌ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చట్టంలోని సెక్షన్‌ 14 ప్రకారం బైజూస్‌ సంస్థకు కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. అసలు బైజూస్‌ ఏయే కోర్సులు అందిస్తోంది? ఆ సంస్థ వద్ద ఉన్న కరికులమ్‌ ఏమిటి? ఏ కోర్సుకు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు? రీఫండ్‌ పాలసీ ఏమిటి? వంటి అంశాలపై సమగ్ర ఆధారాలతో శుక్రవారం కమిషన్‌ ముందు హాజరుకావాలని బైజూస్‌ సీఈవోను ఆదేశించింది.

ఏపీలో ఎందుకంత ప్రేమ?

బైజూస్‌కు సొంతంగా ఓ కరికులమ్‌ లేదు. విద్యాపాలసీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సిలబస్‌ ఆధారంగా ట్యూషన్‌ మెటీరియల్‌(Tuition material) తయారు చేసి వాటి ఆధారంగా ట్యూషన్‌లు చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పనిచేయడానికి నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులకు నేరుగా పాఠాలు చెప్పి, వారి సందేహాలు తీర్చుతున్నారు. అయినా సరే... సర్కారు బైజూస్‌ వెంటపడుతోంది. ఆ సంస్థ కంటెంట్‌ గొప్పదని, దాన్ని 8వ తరగతి వారికి ఇప్పించేందుకు 500 కోట్ల విలువైన ట్యాబ్‌లు కొనుగోలు చేసింది. నిజానికి ఇప్పుడు బైజూస్‌ పరిస్థితి ఎంతమాత్రం బాగలేదు. ఊహించని స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటికే 5 శాతంపైనే ఉద్యోగులను ఇంటికి పంపించిందని... మున్ముందూ కోతలు ఉంటాయని మార్కెట్‌ వర్గాల అంచనా. సొంతంగా సిలబస్‌(Syllabus) లేని సంస్థ ఇచ్చే కంటెంట్‌ గొప్పది కానేకాదని విద్యారంగ నిపుణులు పదేపదే చెబుతున్నా సర్కారు మాత్రం బైజూస్‌ను నెత్తిన పెట్టుకోవడం వెనుక అంతరార్థం ఏమిటో!

‘బెదిరింపులు’ ఇలా...

తప్పుడు పద్ధతుల్లో సేకరించిన ఫోన్‌ నంబర్లు, ఇతర సమాచారంతో బైజూస్‌ ప్రతినిధులు నేరుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను కలుస్తారు. చిన్న వయస్సు నుంచే బైజూస్‌లో ట్యూషన్‌లు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని, లేదంటే సాధారణ విద్యార్థిగానే మిగిలిపోతారని తల్లిదండ్రులను బెదరగొడతారు. తీరా ట్యూషన్‌లు తీసుకున్నాక అవి నచ్చక చందాను సబ్‌స్ర్కిప్షన్‌ రద్దుకోరితే తమను బెదిరిస్తున్నారని, రీఫండ్‌ చేయడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పరిణామాలపై మొత్తం 28 మంది ఎన్‌సీపీసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. గుట్టుగా తమ ఫోన్‌నెంబర్లు తెలుసుకొని తమను బెదిరించి చందాలు తీసుకున్నారని బాధిత తల్లిదండ్రులు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

కొసమెరుపు:

బైజూస్‌ సంస్థ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌, దాని అధికారాల గురించి కూడా ట్యూషన్‌ నోట్స్‌ తయారు చేసింది. ఇప్పుడు... అదే కమిషన్‌ బైజూస్‌కు సమన్లు ఇవ్వడం కొసమెరుపు!

బైజూస్‌పై మరో సంస్థ నజర్‌...

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల (సీఏ) విభాగం కూడా బైజూస్‌ అక్రమాలపై దృష్టి సారించింది. తమకు అందిన ఫిర్యాదులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రం ఇచ్చే సూచనల మేరకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తమది ట్యూషన్ల వ్యాపారమని, ఎవ్వరినీ బెదిరించడం లేదని, అంతా పారదర్శకమనే అని బైజూస్‌ పదేపదే చెబుతున్నా... క్షేత్రస్థాయిలో ఆ సంస్థ ప్రతినిధుల ఆగడాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతునే ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగుల తొలగింపు, అప్పులతో బైజూస్‌ తరచూ వార్తల్లోకి వస్తోంది. ఇప్పుడు... కేంద్ర సంస్థలూ ఈ సంస్థపై దృష్టి సారించడం గమనార్హం.

ఫోన్‌ నంబర్లు సేకరించేదిలా...

ఎడ్‌టెక్‌ రంగంలో స్టార్ట్‌పగా మొదలైన బైజూస్‌కు కరోనా(Corona) కాలం బాగా కలిసి వచ్చింది. లాక్‌డౌన్‌(Lockdown) కారణంగా విద్యాసంస్థలు మూసివేయడంతో ఆన్‌లైన్‌ తరగతులు, ట్యూషన్లకు భారీగా విద్యార్థులను చందాదారులుగా చేర్చుకుంది. ఫీజులను కూడా పెంచేసింది. నాలుగో తరగతి నుంచే ట్యూషన్ల వ్యాపారం చేస్తోన్న ఈ సంస్థ ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్‌ అంటే ఒకటో తరగతి విద్యార్థులపై కూడా ఫోకస్‌ పెట్టింది. ఇందుకోసం తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు సంపాదించాలి. నేరుగా ఇంటింటి సర్వే చేసి సమాచారం అడిగితే ఇవ్వరు. అలాగని పాఠశాలలకు వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు, అడ్రస్‌లు కావాలంటే ఇవ్వనే ఇవ్వరు. టెలికాం ఆపరేటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుంచి దొడ్డిదారిలో ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం.

Updated Date - 2022-12-22T11:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising