Department of Education: దూరవిద్య చదివిన ఉపాధ్యాయులెవ్వరు...?
ABN , First Publish Date - 2022-12-09T10:21:00+05:30 IST
దూరవిద్య ద్వారా చదివి ఉపాధ్యాయులుగా నియమితులైన వారి వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు
- వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 8: దూరవిద్య ద్వారా చదివి ఉపాధ్యాయులుగా నియమితులైన వారి వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు దాఖలుచేసిన కేసులో, దూరవిద్యలో చదివిన వారికి పదోన్నతులకు అనర్హులు, ప్రత్యక్ష తరగతుల్లో చదివిన వారి పదోన్నతులకు సంబంధించి దరఖాస్తులు పరిశీలించాలని ఇటీవల మద్రాసు హైకోర్టు(Madras High Court) ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, దూరవిద్య చదివిన వారికన్నా, ప్రత్యక్ష తరగతుల్లో చదివిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, దూరవిద్య చదివి ఉపాఽధ్యాయ పోస్టుల్లో చేరారా అనే వివరాలను జిల్లా విద్యాధికారులు సేకరిస్తున్నారు. దూరవిద్యకు సంబంధించిన వివరాలను న్యాయస్థానం కోరితే సత్వరం సమర్పించేలా ఈ జాబితా తయారుచేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. ఇక, దూరవిద్యను విశ్వవిద్యాలయ సిండికేట్ అనుమతించడంతో, అలా చదివిన వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు ఇప్పటివరకు ఎలాంటి నిషేధం విధించలేదు.