ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mamata-Suvendu meet : మమత, సువేందు మాటామంతి... బీజేపీలో కలకలం...

ABN, First Publish Date - 2022-11-27T13:55:52+05:30

: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ శాసన సభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి (Suvendu Adhikari) శుక్రవారం

Suvendu Adhikari, Mamata Banerjee
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee), శాసన సభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి (Suvendu Adhikari) శుక్రవారం కాసేపు సమావేశమవడంతో బీజేపీలో కలకలం రేగుతోంది. సువేందు ఇచ్చిన వివరణ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను సంతృప్తిపరచలేకపోతోంది. ఈ భేటీ వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు బీజేపీ నేతలు వాపోతున్నారు.

మమత బెనర్జీ ఆహ్వానం మేరకు సువేందు అధికారి శాసన సభలోని సీఎం చాంబర్‌కు శుక్రవారం వెళ్ళారు. ఆయనతోపాటు బీజేపీ చీఫ్ విప్ మనోజ్ టిగ్గా, ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పౌల్, అశోక్ లాహిరి కూడా ఉన్నారు. వీరంతా దాదాపు నాలుగు నిమిషాల సేపు మాట్లాడుకున్నారు. ఈ భేటీ మర్యాదపూర్వకమేనని మమత, సువేందు చెప్పారు.

తన తాహతును మమత గుర్తించారని సువేందు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు బీజేపీ నేతలు ఆయనకు అసౌకర్యం కలిగించే ప్రశ్నలను సంధిస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ, మమత, సువేందు మధ్య చిరకాల అనుబంధం ఉందని, ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు. కాళీ ఘాట్‌లో ఆమెను చాలా మంది కలిశారని, సువేందు ఆమెను శాసన సభలో పలుకరించారని చెప్పారు. అది వారి వ్యక్తిగత సంబంధాలకు సంబంధించినదని తెలిపారు. ఇతరులను పలుకరించడం ప్రజలకు సంబంధించిన విషయమని తాను అనుకోవడం లేదన్నారు. అది గౌరవానికి సంబంధించిన విషయమని తెలిపారు. సువేందు 2021 శాసన సభ ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో సువేందు చేతిలో మమత పరాజయం పాలయ్యారు.

ఇదిలావుండగా, మమత నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, తప్పుడు పద్ధతుల్లో పరిపాలన సాగిస్తోందని గట్టిగా చెప్తున్న సమయంలో ఆమెను సువేందు కలవడం వల్ల టీఎంసీకి అనవసరమైన లాభం జరుగుతుందని దిలీప్ ఘోష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా శనివారం సువేందు అధికారితో మాట్లాడినట్లు తెలుస్తోంది. మమత, సువేందు సమావేశం వల్ల పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థయిర్యం దెబ్బతిందని చాలా మంది నేతలు సుకాంతకు చెప్పినట్లు సమాచారం. అయితే సుకాంత శనివారం మీడియాతో మాట్లాడుతూ, శాసన సభలో రాజకీయపరమైన మర్యాదలు ఇతర రాష్ట్రాల్లో సహజమేనని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఆ సంప్రదాయం కొనసాగాలన్నారు. అయితే వీరి భేటీ వల్ల పార్టీ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయని సుకాంత ఆందోళన చెందుతున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

మరోవైపు సువేందు సోదరుడు, టీఎంసీ ఎంపీ దిబ్యేందు అధికారి శనివారం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని తేనీటి విందుకు ఆహ్వానించారు. డిసెంబరు 3న కాంటాయ్‌లో పర్యటిస్తున్న సందర్భంగా తేనీటి విందుకు హాజరుకావాలని అభిషేక్‌ను కోరారు.

శాసన సభ స్పీకర్ బిమన్ బెనర్జీ శనివారం మాట్లాడుతూ, మమత బెనర్జీ ప్రతిపక్ష నేతను తన చాంబర్‌కు ఆహ్వానించడాన్ని స్వాగతించారు.

మమత లొంగుబాటు

సువేందు అధికారి శనివారం మాట్లాడుతూ, తనను మమత బెనర్జీ ఆహ్వానించడం ఆమె లొంగుబాటుకు నిదర్శనమని చెప్పారు. ప్రతిపక్షాల ముందు ఆమె లొంగిపోయారని తెలిపారు. కానీ తాము ఆమెను వదిలిపెట్టేది లేదన్నారు. తాను ఆమెను పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రిని చేస్తానన్నారు.

Updated Date - 2022-11-27T13:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising