వాణిజ్య భవన్ ను ప్రారంభించనున్న పీఎం మోదీ
ABN , First Publish Date - 2022-06-22T22:13:40+05:30 IST
కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రిత్వ శాఖ నూతన భవనం ‘వాణిజ్యభవన్’ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించనున్నారు.

న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రిత్వ శాఖ నూతన భవనం ‘వాణిజ్యభవన్’ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించనున్నారు. ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ రికార్డ్ ఫర్ ఈయర్లీఅనాలసిస్ ఆఫ్ ట్రేడ్(ఎన్ఐఆర్ వై ఏటీ) పోర్టల్ ను కూడా ప్రధాని ఆవిష్కరించనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోర్టల్ ద్వారా స్టేక్ హోల్డర్స్ కు ఒక వేదికలా ఇది ఉపయోగ పడుతుందని తెలిపారు.
భారతీయ విదేశీ వ్యాపారానికి సంబంధించి పూర్తి సమాచారం ఈ పోర్టల్ ద్వారా అందుబాటులోకి రానుందని తెలిపారు. ఇండియా గేట్ సమీపంలో నిర్మించి వాణిజ్యభవన్ వినూత్నమైన ఆర్కిటెక్చర్ డిజైన్ తో నిర్మించారు.ప్రత్యేకించి విద్యుత్ ఆదాచేసే విధానాన్ని అనుసరించారు. వాణిజ్య ప్రమోషన్, పరిశ్రమలకు సంబంధించి ఒకే గొడుగు కింద నిర్వహించుకునేందుకు వాణిజ్యభవన్ ఉపయోగ పడుతుందని అధికారులు తెలిపారు.