ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat Jodo Yatra : మైక్ ఆన్/ఆఫ్ చేస్తూ బీజేపీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2022-11-10T16:15:44+05:30

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోని నాందేడ్‌లో కొనసాగుతోంది.

Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాందేడ్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలోని నాందేడ్‌లో కొనసాగుతోంది. ఆయన గురువారం మాట్లాడుతూ పార్లమెంటులో జరిగే సన్నివేశాలను వివరించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి రుచించని అంశాలపై ప్రతిపక్షాలు మాట్లాడితే, వెంటనే మైక్‌ను ఆపేస్తారన్నారు. తన చేతిలోని మైక్‌ను ఆన్/ఆఫ్ చేస్తూ పార్లమెంటులో పరిస్థితులను వివరించారు.

కన్యా కుమారి నుంచి కశ్మీరు వరకు సాగే భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ప్రస్తుతం నాలుగు రోజుల నుంచి మహారాష్ట్రలో జరుగుతోంది. నాందేడ్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ, తన చేతిలోని మైక్‌ను ఆన్/ఆఫ్ చేస్తూ పార్లమెంటులో పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి రుచించని అంశాలను ప్రతిపక్షాలు పార్లమెంటులో లేవనెత్తినపుడు, ప్రతిపక్ష నేతల మైక్‌లు ఆగిపోతాయని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు గురించి తాము మాట్లాడిన ప్రతిసారీ తమ మైక్‌లు ఆఫ్ అయిపోతాయన్నారు. ఈ మాటలు చెప్తూ తన చేతిలోని మైక్‌ను ఆఫ్ చేసి చూపించారు. కాసేపటి తర్వాత దానిని ఆన్ చేసి, ఇక్కడ తన వద్ద కంట్రోల్స్ ఉన్నాయని, పార్లమెంటులో మాత్రం అలా కాదని చెప్పారు. ఏం జరుగుతోందని తాము ఆశ్చర్యపోతూ ఉంటామని చెప్పారు.

చైనా సైన్యం మన దేశంలోకి వచ్చి, 2,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకుందని తాను పార్లమెంటులో చెబుతూ ఉంటే, వెంటనే మైక్ ఆఫ్ అయిపోతుందన్నారు. తాను మాట్లాడాలనుకున్నదానిని వినేవారు లేరన్నారు.

ప్రతిపక్షాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉసిగొలుపుతున్నారనే ఆరోపణల గురించి ఓ వ్యక్తి ప్రస్తావించినపుడు రాహుల్ మాట్లాడుతూ, ఈడీ, షీడీలంటే తనకు భయం లేదన్నారు.

Updated Date - 2022-11-10T16:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising