Sudhakar Reddy: వరద బాధిత ప్రాంతాల్లో పొంగులేటి పర్యటన

ABN , First Publish Date - 2022-11-04T11:12:33+05:30 IST

భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి(Ponguleti Sudhakar Reddy) నగరంలోని వరద బాధిత ప్రాంతాల్లో గు

Sudhakar Reddy: వరద బాధిత ప్రాంతాల్లో పొంగులేటి పర్యటన

అడయార్‌, నవంబరు 3: భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి(Ponguleti Sudhakar Reddy) నగరంలోని వరద బాధిత ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. గత మూడు రోజులుగా చెన్నై నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరి అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంతాలైన వీరబాబు వీధి, వీరా శెట్టి వీధి, పులియంతోపు, 72, 73 వార్డుల్లోని పలు ప్రాంతాల్లో పొంగులేటి పర్యటించి వరద బాధితులకు ఆహారం ప్యాకెట్లు ఇతర సామాగ్రి అందజేశారు. అదేవిధంగా వర్షాల కారణంగా చనిపోయిన శాంతి కబాలి కుటుంబానికి స్థానిక బీజేపీ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి శరవణన్‌ సమకూర్చిన రూ.25 వేల ఆర్థిక సాయాన్ని మృతురాలి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షబాధితులను ఆదుకునేలా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, అవసరమైన సహాయ సామాగ్రిని అందజేయాలని ఆయన కోరారు. పొంగులేటి వెంట స్థానిక బీజేపీ నేతలు జీకే సురేష్‌, అంకిత్‌, కుమార్‌, సంతోష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-04T11:12:35+05:30 IST