ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uddhav Thackeray: తండ్రి బాల్ థాకరే వర్ధంతి వేళ శివసేనలో ఒంటరివాడైన ఉద్ధవ్

ABN, First Publish Date - 2022-11-17T18:49:51+05:30

శివసేన (Shiv Sena) వ్యవస్థాపకుడు బాల్ థాకరే (Bal Thackeray) వర్ధంతి నేడు.

Uddhav Thackeray
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: శివసేన (Shiv Sena) వ్యవస్థాపకుడు బాల్ థాకరే (Bal Thackeray) వర్ధంతి నేడు. స్వాతంత్ర వీర సావర్కర్‌ (Veer Savarkar) సిద్ధాంతాలు, హిందుత్వ విధానాలతో ప్రభావితుడై బాల్ థాకరే శివసేన స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ అంటే మండిపడే బాల్‌థాకరే ఇందిరాగాంధీ (Indira Gandhi) విధించిన ఎమర్జెన్సీ (Emergency) రోజులను ఎప్పటికీ మరచిపోలేనని తరచూ విమర్శించేవారు. జీవించినంత కాలం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారు. అయితే ఆయన తనయుడు ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) మాత్రం తండ్రి సిద్ధాంతాలను గాలికి వదిలి మహారాష్ట్ర(Maharashtra)లో అధికారం కోసం కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఎన్సీపీని కూడా కలుపుకుని మహాఘట్‌బంధన్ ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు తరచూ స్వాతంత్ర వీర సావర్కర్‌ను తీవ్రంగా విమర్శించినా అధికారం కోసం ఉద్ధవ్ తేలిగ్గా తీసుకున్నారు. అంతే కాదు బాల్ థాకరే అనుసరించిన హిందుత్వ విధానాలకు ఉద్ధవ్ తిలోదకాలిచ్చారు. ఆ తర్వాత ఉద్ధవ్ ఎత్తుగడలు, విధానాలు నచ్చని శివసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు వేరు కుంపటి పెట్టుకున్నారు. బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు. హిందుత్వ విధానాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో శివసేనను కాపాడుకునేందుకు తాము మళ్లీ బీజేపీతో చేతులు కలిపామని ఏక్‌నాథ్ శిండే వర్గీయులు తరచూ చెబుతుంటారు. మూల సిద్ధాంతం నుంచి ఉద్ధవ్ వెనక్కు మళ్లడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

వాస్తవానికి 2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections 2019) శివసేన బీజేపీ పొత్తులో సీట్లు పంచుకుని అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్థానాలు సంపాదించారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో బాల్ థాకరే సమయంలోనే కుదిరిన పాత ఫార్ములా ప్రకారం ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే ముఖ్యమంత్రి పీఠమనే విషయానికి ఉద్ధవ్ తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహాఘట్‌బంధన్ ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సీఎం పదవి కోల్పోవడంతో పాటు మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు శిండే జట్టులో చేరిపోయారు. ఉద్ధవ్ దాదాపు ఒంటరివారైపోయారు.

మరోవైపు భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తోన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వాతంత్ర వీర సావర్కర్‌ను మరోసారి టార్గెట్ చేశారు. అకోలాలో విలేకరుల సమావేశం నిర్వహించి మరీ సావర్కర్‌పై విమర్శలు గుప్పించారు. సావర్కర్ బ్రిటీష్ వారికి రాశారని భావిస్తోన్న లేఖను రాహుల్ చదివి వినిపించారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీ, నెహ్రూ, పటేల్ బ్రిటీష్ వారికి క్షమాపణలు చెప్పలేదని, సావర్కర్ మాత్రం బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పారని రాహుల్ ఆరోపించారు. గాంధీ, నెహ్రూ, పటేల్‌లకు ద్రోహం చేయడంతో పాటు సావర్కర్ బ్రిటీష్ వారికి సహకరించారని కూడా రాహుల్ ఆరోపణలు చేశారు.

వీర సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే ఉద్ధవ్ థాకరే మాత్రం రాహుల్ విమర్శలపై అంత సీరియస్‌గా స్పందించలేదు. సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించబోమని మాత్రమే చెప్పారు. ఉద్ధవ్ ఇప్పటికీ కాంగ్రెస్, ఎన్సీపీతో మహాఘట్‌బంధన్ కొనసాగిస్తుండటంతో రాహుల్‌కు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. తన తండ్రి అత్యంత ఇష్టపడే వీర సావర్కర్ గురించి మహారాష్ట్ర గడ్డపై రాహుల్ తీవ్ర విమర్శలు చేసినా ఉద్ధవ్ కూల్‌గానే ఉన్నారు. తండ్రి సిద్ధాంతాలతో ఎదిగానని చెప్పుకునే ఉద్ధవ్ హిందుత్వ విధానాలపై పూర్తి స్థాయిలో రాజీపడిపోయారని శివసేన నుంచి చీలిపోయిన మెజార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఉద్ధవ్ ఇప్పటికైనా తన తండ్రి చూపిన బాటలోకి రాకపోతే ఎప్పటికీ వేరుకుంపటి పెట్టుకున్న శివసేన వర్గానిదే పైచేయి అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హిందుత్వ సిద్ధాంతాలపై రాజీ ధోరణి అవలంభిస్తోన్న ఉద్ధవ్ ఇప్పటిలాగే ఎప్పటికీ ఒంటరివాడిగా మిగిలిపోతాడని మరాఠీ రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-17T18:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising