Kuwait: ప్రవాసులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆరోగ్య పరీక్షల కోసం బెంగ వద్దు
ABN, First Publish Date - 2022-11-08T08:12:08+05:30
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాస కార్మికుల (Expatriate workers) ఆరోగ్య పరీక్షలకు (Health examining) సంబంధించి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాస కార్మికుల (Expatriate workers) ఆరోగ్య పరీక్షలకు (Health examining) సంబంధించి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారులను పరీక్షించడంలో ప్రైవేట్ రంగాన్ని (Private sector) భాగస్వామ్యం చేయాలని ఆ దేశ ఆరోగ్యశాఖ యోచిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధాలు, సర్వీస్ ఛార్జీలు, అనుసంధాన ప్రణాళిక తదితర అంశాలపై ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు, ఆరోగ్య మంత్రిత్వశాఖ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల ద్వారా ఇరు వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించడం, కొన్ని పరీక్షల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడంతో పాటు అంటూ, దీర్ఘకాలిక వ్యాధులను త్వరగా గుర్తించడం లాంటి చర్యల కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు పడినట్లు ఆరోగ్యశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రవాసుల ఆరోగ్య పరీక్షలు ఉంటాయని చెప్పారు.
Updated Date - 2022-11-08T08:12:09+05:30 IST