ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TANA: అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు కార్యక్రమానికి శ్రీకారం

ABN, First Publish Date - 2022-12-08T13:13:08+05:30

అమెరికాలో ఆరు రాష్ట్రాల సమ్మేళనం సందర్భంగా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో తానా వారు "అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో ఆరు రాష్ట్రాల సమ్మేళనం సందర్భంగా న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో తానా వారు "అమెరికా లైబ్రరీలలో తెలుగు పుస్తకాలు" కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్త తరానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా తానా బోస్టన్ సమీపంలో ఉన్న వెస్ట్‌బరో లైబ్రరీకి అనేక పుస్తకాలను అందించింది. ఆంగ్ల తెలుగు నిఘంటువు, వేమన పద్యాలు, చందమామ కథలు, పెద్ద బాల శిక్ష ఇలా మరెన్నో పుస్తకాలను పంపిణీ చేశారు. భవిష్యత్తులో న్యూ ఇంగ్లాండ్‌లో ఉన్న అనేక లైబ్రరీలలో తెలుగు పుస్తకాలను తానా అందుబాటులోకి తెచ్చేందుకు నడుం బిగించింది.

తెలుగు మాతృభాషా ప్రజలందరూ మన భాషను కాపాడుకోవడానికి అందరము నడుం బిగించాలని ఈ సందర్భంగా ఎన్నారైలు పిలుపునిచ్చారు. తెలుగు భాషను, మన సంస్కృతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఏదో చేబుతున్నాం అనే వొరవడి కాకుండా తెలుగు భాష పట్ల పిల్లలకు చిన్నపుడు నుంచి శ్రద్ధ కలిపించాలని తెలిపారు. తెలుగు పిల్లలందరికీ మాతృ భాషలోని మాధుర్యాన్ని నేర్పించాలన్నారు. “నా కుటుంబం నా తెలుగు” లాంటి మనస్తత్వం పిల్లలకు నేర్పించాలని కోరారు.

మాతృభాష మాధుర్యాన్ని తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలకు వివరించగలరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాయప్రోలు సుబ్బారావు గారి ‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము’’ ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. తెలుగు భాష కోసం ఎందరో పండితులు, విద్వాంసులు, ఉపాధ్యాయులు తమ జీవితాన్నంతా ధార బోశారు. తెలుగు గురించి వారి బోధనలన్నీ చాలా విలువైనవి, వెల కట్టలేనివి, పర భాష పర భాషే.. మాతృ భాష మాతృత్వానికి నిదర్శనం అని అన్నారు.

ఈ లైబ్రరీలో మీకు అవసరమైన తెలుగు పుస్తకం దొరకకపోతే మరియు ఎవరికైనా తెలుగు పుస్తకం కావాలంటే దయచేసి తానా ప్రాంతీయ ప్రతినిధి ప్రదీప్ గడ్డంను www.tana.org ద్వారా సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా న్యూ ఇంగ్లాండ్ తానా ప్రతినిధి ప్రదీప్ గడ్డం, కెపి సోంపల్లి, గోపి నెక్కలపూడి, విజయ్ బెజవాడ, శ్రీనివాస్ గొర్లే, పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ నరేన్ కొడాలి, తానా అధ్యక్షుడు అంజయ్య లావు, రాజా కసుకుర్తి, అనిల్ ఉప్పలపాటి, భాను మొగలూరుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-12-08T13:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising