ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Smita Prabhakar: యూఏఈ ఆర్ట్ వరల్డ్‌లో 42ఏళ్ల ప్రస్థానం.. భారతీయురాలి ప్రతిభకు అరబ్ దేశం సలాం

ABN, First Publish Date - 2022-11-18T11:21:03+05:30

'మన ప్రతిభ ఏంటో మనకు తెలిస్తే.. ఆటోమెటిక్‌గా మనం చేసే పనిలో విజయం సాధిస్తాం' అనేది జగమేరిగిన సక్సెస్ మంత్ర. ఇదిగో దీన్నే ఫాలో అయ్యారు యూఏఈలో ఉండే భారతీయురాలు స్మిత ప్రభాకర్ (Smita Prabhakar).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: 'మన ప్రతిభ ఏంటో మనకు తెలిస్తే.. ఆటోమెటిక్‌గా మనం చేసే పనిలో విజయం సాధిస్తాం' అనేది జగమేరిగిన సక్సెస్ మంత్ర. ఇదిగో దీన్నే ఫాలో అయ్యారు యూఏఈలో ఉండే భారతీయురాలు స్మిత ప్రభాకర్ (Smita Prabhakar). నాలుగు దశాబ్దాల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (United Arab Emirates) వెళ్లిన ఆమె ఆర్టే తన ప్రపంచంగా బతికారు. ఆర్ట్‌లో ఆమె చేయని ప్రయోగాలు లేవు. దాంతో ఇప్పుడు అక్కడ ఆర్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే మొదట గుర్తుకు వచ్చే పేరు స్మితనే. అంతలా ఆమె ఆర్ట్ వరల్డ్‌లో తన ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం యూఏఈ ఆర్ట్ సర్కిల్స్‌లో స్మిత ప్రభాకర్ పేరు ఓ సంచలనం. ఆర్ట్‌పై ఆమెకు ఉన్న మక్కువతో దక్షిణాసియా వాసుల కోసం 'ఈష్రా ఆర్ట్ ఫౌండేషన్' (Ishara Art Foundation) పేరిట ఓ స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఆర్ట్‌లో ప్రతిభ కలిగినవారిని ఉచితంగా శిక్షణ ఇస్తున్నరామె. ఇక స్మిత ప్రభాకర్ ఆర్ట్ రంగంలో చేస్తున్న సేవలను గుర్తించిన అక్కడి సర్కార్ ఆమె‌కు అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఆర్ట్ దుబాయ్‌లో చోటు కల్పించింది. అలాగే ఆమె టేట్ మోడ్రన్ (లండన్)లోని సౌత్ ఆసియన్ అక్విజిషన్స్ కమిటీ, మిడిల్ ఈస్టర్న్ సర్కిల్ ఆఫ్ ది గుగ్గెన్‌హీమ్ మ్యూజియం (న్యూయార్క్), పెగ్గి గుగ్గెన్‌హీమ్ కలెక్షన్ (వెనిస్) లలో సభ్యురాలు. ఇదంతా కూడా ఆమెకు ఆర్ట్ వల్ల దక్కిన గుర్తింపు.

స్మిత ప్రభాకర్ గురించి చెప్పాలంటే..

స్మిత తండ్రి రైల్వే ఉద్యోగి. కోల్‌కతాలో నివాసం ఉండేవారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీ చదివారు. చదువు పూర్తైన తర్వాత ఉద్యోగ అన్వేషణలో ఉండగా.. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకరోజు యూఏఈ వెళ్లారు. అలా వెళ్లిన ఆమెను అక్కడి ఆర్ట్ విపరీతంగా ఆకర్షించింది. దాంతో ఆరోజే నిర్ణయించుకున్నారట.. ఇకపై తన గమ్యం ఆర్టేనని. అంతే.. అక్కడి నుంచి ఇండియాకు వచ్చి తన తండ్రితో విషయం చెప్పారు. ఆయన కూడా స్మిత నిర్ణయాన్ని అడ్డు చెప్పలేదు. దాంతో చాలా తక్కువ రోజుల్లోనే తిరిగి యూఏఈ పయనం అయ్యారు స్మిత. అలా 42 ఏళ్ల కింద భారత్ నుంచి యూఏఈ వలస వెళ్లారామె. ఆ తర్వాత రమేష్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. ఇక ఆర్ట్‌లో తనకు వచ్చిన గుర్తింపు వెనుక తనతో పాటు తన భర్త కష్టం కూడా చాలా ఉందంటారామె.

యూఏఈలో ఆమె 'ఆర్ట్ జర్నీ' మొదలైంది ఇలా..

దుబాయ్ వెళ్లిన మొదట్లో చాలా కష్టపడ్డారట స్మిత ప్రభాకర్. స్వదేశంలో ఉన్నప్పుడు అన్ని పేరెంట్సే చూసేకునేవారు. దాంతో ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. కానీ, దుబాయ్ వచ్చాక ఆమెకు జీవితమంటే ఏమిటో తెలిసోచ్చిందట. 'ఇన్నాళ్లు అమ్మనాన్న అన్ని సమకూరుస్తుంటే ఏమీ తెలియలేదు. కానీ, ఇక్కడి వచ్చాక ఒకరోజు గడవాలంటే ఇన్ని ఉంటాయా అని' అనుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇక భర్తతో కలిసి రోజూ డ్యూటీకి వెళ్లడం.. ఆ తర్వాత ఇంటికి వచ్చాక తనకు ఇష్టమైన బుక్స్ చదవడం, ఆర్ట్, మ్యూజిక్ వినడం చేసేవారు. అప్పుడే తన సామర్థ్యం ఏమిటో కూడా తనకు తెలిసిందంటారు స్మిత. ఆర్ట్‌లో తన ప్రతిభ గురించి కూడా ఆ సమయంలోనే తెలిసిందట. దాంతో సెలవు రోజుల్లో ఆర్ట్‌పై బాగా ఫోకస్ పెట్టేవారట. ఈ క్రమంలో ఒకసారి ఆమె ఢిల్లీకి వచ్చి ప్రత్యేకంగా కొన్ని ఆర్ట్ ఐటెంలను కొనుగోలు చేశారట. అవి ఇప్పటికీ తన వద్ద ఉన్నాయట. ఆ తర్వాత ఆర్ట్‌లో తన ప్రతిభతో 1991లో ఓ సంస్థ ద్వారా తన జర్నీ మొదలైందని స్మిత ప్రభాకర్ తెలిపారు. మొదటిసారి ఓ ఇరానియన్ కార్పెట్‌పై తన ఆర్ట్ వేశానని చెప్పారు.

2019లో 'ఈష్రా ఆర్ట్ ఫౌండేషన్' ప్రారంభం..

2019లో స్మిత ప్రభాకర్ ప్రారంభించిన 'ఈష్రా ఆర్ట్ ఫౌండేషన్' ఉద్దేశం చాలా సింపుల్. ఇది సౌత్ ఏషియా ఆర్టిస్టులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌. దక్షిణాసియాలోని కళాకారులు ప్రపంచ శ్రేణి ప్రతిభను కలిగి ఉన్నారని, వారు ప్రపంచంలో ఎక్కడైనా తమ సామర్థ్యంలో తోటి వారితో సమానంగా నిల్చోగలరని తాను నమ్ముతున్నానని స్మిత అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహచరులకు ఉన్న అవకాశాలు వారికి లేవు. మనం ఒక చిన్న ప్లాట్‌ఫారమ్‌ను వారికి అందించగలిగితే, వారి కళను చూడవలసిన వ్యక్తులు చూడగలిగేలా - అది ఒక వైవిధ్యాన్ని కలిగిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-03-20T11:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising