Devineni Uma: జగన్‌పై దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు.. వాటాలు ఇవ్వలేక పారిశ్రామికవేత్తలు..
ABN, First Publish Date - 2022-11-20T18:46:41+05:30
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jagan)పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma)విమర్శలు గుప్పించారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jagan)పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma)విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డి సర్కార్‌పై ట్విట్టర్‌లో దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. క్వారీల నుంచి పోర్టుల వరకు బలవంతంగా లాక్కున్నారని, వాటాలు ఇవ్వలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని దేవినేని ఆరోపించారు. 'ఇదేం ఖర్మ-ఈ రాష్ట్రానికి' అంటూ ప్రజలు బాధపడుతున్నారని, జగన్‌రెడ్డి కబంధ హస్తాల నుంచి ఏపీని కాపాడుకోవాలని దేవినేని ఉమ అన్నారు.
Updated Date - 2022-11-20T18:52:07+05:30 IST