Lokesh: పేదల కన్నీరు చూడడమే లక్ష్యంగా చిన్న సైకో పనిచేస్తున్నారు

ABN, First Publish Date - 2022-11-09T19:55:37+05:30

వైసీపీ ప్రభుత్వం (Ycp Govt)పై టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Lokesh)విమర్శలు గుప్పించారు.

Lokesh: పేదల కన్నీరు చూడడమే లక్ష్యంగా చిన్న సైకో పనిచేస్తున్నారు
Lokesh, Tdp
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వం (Ycp Govt)పై టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Lokesh)విమర్శలు గుప్పించారు. ఏపీలో సైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం రాబోతోందని, జగన్‌మోహన్‌రెడ్డిది.. జేసీబీ ప్రభుత్వమని లోకేష్ విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర అధికార వాహనంగా జేసీబీ మారిందని లోకేష్ మండిపడ్డారు. మంగళగిరిలో పేదల కన్నీరు చూడడమే లక్ష్యంగా చిన్న సైకో ఆళ్ల రామకృష్ణారెడ్డి పనిచేస్తున్నారని లోకేష్ ఆరోపించారు.

దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు లేని ఇప్పటం (Ippatam)లో అలజడి రేపారని, టీడీపీకి మెజార్టీ వచ్చిందని.. జనసేన సభకు భూములిచ్చారని రాజకీయ కక్షతో చిన్న సైకో ఇళ్లు కూలగొట్టించాడని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలు పూడ్చలేనివారు 120 అడుగుల రోడ్డు వేస్తామంటే నమ్మాలా?, ప్రజలు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే ఇంత కక్ష చూపిస్తారా? అని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పటం గ్రామానికి వందల కోట్లు ఖర్చు పెట్టామంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లపై సవాల్‌కు సిద్ధమని నారా లోకేష్‌ అన్నారు. వైసీపీ ఖర్చు చేశామంటున్న రోడ్లెక్కడా.. డ్రైన్లెక్కడా?, టీడీపీ హయాంలో వేసిన డ్రైన్లకు తమ పేర్లు వేసుకోవడానికి సిగ్గుండాలని లోకేష్ మండిపడ్డారు. సీఎం ఇంటి చుట్టూ చేసుకునే భద్రతా ఏర్పాట్లను మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ఖాతాలో చూపడం సిగ్గుచేటని లోకేష్‌ అన్నారు.

Updated Date - 2022-11-09T19:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising